US Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాక్‌.. విజిటింగ్‌ వీసా కోసం అప్పటివరకు ఆగాల్సిందే.. హైదరాబాదీలైతే..

అమెరికా వీసాల కోసం మళ్లీ కష్టాలు పెరిగాయి. విజిటర్‌ వీసా కావాలంటే భారతీయులు 2024 వరకు ఆగాల్సిందే. కొవిడ్‌ ఆంక్షలను ఎత్తేయడం , ఇంటర్నేషనల్‌ విమానాల రాకపోకలు పెరగడంతో అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

US Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాక్‌.. విజిటింగ్‌ వీసా కోసం అప్పటివరకు ఆగాల్సిందే.. హైదరాబాదీలైతే..
America Visa
Follow us

|

Updated on: Aug 18, 2022 | 9:53 PM

అమెరికా వీసాల కోసం మళ్లీ కష్టాలు పెరిగాయి. విజిటర్‌ వీసా కావాలంటే భారతీయులు 2024 వరకు ఆగాల్సిందే. కొవిడ్‌ ఆంక్షలను ఎత్తేయడం , ఇంటర్నేషనల్‌ విమానాల రాకపోకలు పెరగడంతో అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అమెరికా వీసా కావాలంటే భారతీయులు 500 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే వాళ్లు యూఎస్‌ కాన్సులేట్‌లో విజిటింగ్‌ వీసా కోసం 582 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. స్టూడెంట్‌ వీసాల కైతే ఢిల్లీలో 471 క్యాలెండర్‌ దినాలను నిర్ణయించారు. ముంబై పౌరులు అమెరికా విజిటింగ్‌ వీసా కోసం 517 రోజులు వేచి ఉండాలి. విద్యార్థుల కైతే 10 రోజుల్లో స్టూడెంట్‌ వీసాలు లభిస్తాయి. హైదరాబాద్‌ వాసులకు కూడా అమెరికా వీసాను సాధించడం కష్టంగా మారింది. విజిటింగ్‌ వీసాకు హైదరాబాద్‌ వాసులు 518 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి. విద్యార్ధులు స్టూడెంట్‌ వీసా కోసం 479 రోజులు వేయిట్‌ చేయాలి. కోల్‌కతా వాసులు అమెరికా విజిటింగ్‌ వీసాల కోసం 587 రోజులు వేయిట్‌ చేయాలి. విద్యార్థులకు మాత్రం రెండు రోజుల్లో స్టూడెంట్ వీసాలు లభిస్తాయి.

చెన్నై నుంచి అమెరికా వెళ్లే వాళ్లు విజిటింగ్‌ వీసా కోసం 513 వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్ధుల కైతే 8 రోజుల్లో స్టూడెంట్‌ వీసా లభిస్తుంది. కరోనా కారణంగా చాలా దేశాల్లో అమెరికా కాన్సులేట్లు వీసాను ఇవ్వడం చాలారోజుల పాటు ఆపేశాయి. గత కొద్దినెలల నుంచి మాత్రం ఈ ఆంక్షలను ఎత్తేశారు. ప్రతి ఏటా భారత్ నుంచి వేలాదిమంది అమెరికాకు వెళ్తుంటారు. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి తక్కువ మందే ప్రయాణాలు చేస్తున్నారు. అయితే కొద్దిరోజుల క్రితమే కొవిడ్‌ ఆంక్షలను సడలించారు. దీంతో విద్యార్ధులతో పాటు అమెరికాలో స్థిరపడ్డ వాళ్ల బంధువులు కూడా అక్కడికి వెళ్లడానికి క్యూ కడుతున్నారు. దీంతో విజిటింగ్‌ వీసాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. అందుకే అమెరికా విజిటింగ్‌ వీసా కోసం 500 రోజులు వేయిట్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..