ఆఫ్ఘన్ ప్రభుత్వ మీడియా హెడ్ హత్యను ఖండించిన అమెరికా.. తాలిబన్లకు తీవ్ర హెచ్చరిక

ఆఫ్ఘన్ ప్రభుత్వ మీడియా డైరెక్టర్ దావా ఖాన్ మీనాపాల్ ను తాలిబన్లు హతమార్చడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ విధమైన చర్యలు తాలిబన్లకు వారు కోరుకుంటున్న లెజిటిమెసీని ఇవ్వబోవని వైట్ హౌస్ అధికార ప్రతినిధి జెన్ సాకి అన్నారు.

ఆఫ్ఘన్ ప్రభుత్వ మీడియా హెడ్ హత్యను ఖండించిన అమెరికా.. తాలిబన్లకు తీవ్ర హెచ్చరిక
Afghanistan Govt Media Head
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 07, 2021 | 9:54 AM

ఆఫ్ఘన్ ప్రభుత్వ మీడియా డైరెక్టర్ దావా ఖాన్ మీనాపాల్ ను తాలిబన్లు హతమార్చడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ విధమైన చర్యలు తాలిబన్లకు వారు కోరుకుంటున్న లెజిటిమెసీని ఇవ్వబోవని వైట్ హౌస్ అధికార ప్రతినిధి జెన్ సాకి అన్నారు. తమకు అంతర్జాతీయంగా న్యాయపరమైన గుర్తింపు కావాలని వారు కోరుకుంటున్నారని..కానీ ఇలాంటి చర్యల వల్ల వారికీ ఇది లభ్యం కాదన్నారు.ఇదే ఎనర్జీని మీరు శాంతి ప్రక్రియ కోసం వినియోగిస్తే మంచిదని ఆమె చెప్పారు. ఆఫ్ఘన్ రక్షణ మంత్రి బిస్మిల్లా మహమ్మద్ నివాసం వద్ద కారు బాంబు పేలుడు ఘటనను కూడా ఆమె ప్రస్తావించారు. దావా ఖాన్ హత్యకు తమదే బాధ్యత అని తాలిబన్లు ప్రకటించుకున్నారు. పైగా ప్రతీకార చర్యలకు దిగుతామని వారు హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయని జెన్ సాకి పేర్కొన్నారు. స్థానిక, ఫారిన్ మీడియాకు ప్రభుత్వ కార్యకలాపాల గురించి వివరించే దావా ఖాన్ శుక్రవారం తాలిబన్ల కాల్పుల్లో మృతి చెందారు. ఆఫ్ఘన్ ను సైనిక పరంగా గానీ లేదా తాలిబన్ల ఇస్లామిక్ ఎమిరేట్స్ రిటర్న్ గా గానీ స్వాధీనం చేసుకోవడానికి గానీ తాము అంగీకరించబోమని సాకి చెప్పారు.

మరోవైపు-అమాయకుల ప్రాణాలను పొట్టన బెట్టుకోవడమో లేదా మాస్ హింసకు పాల్పడడమో తాలిబాన్లకు తగదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల వ్యాఖ్యానించారు. తాలిబన్ల చర్యలను ఆయన పరోక్షంగా ఖండించారు. తాము కోరుకుంటున్న న్యాయపరమైన గుర్తింపును వారు సాధించలేరన్నారు.. నిమ్రాజ్ లోని కటక్ జిల్లాను తమ హస్తగతం చేసుకున్న తాలిబన్లు పూర్తిగా దీనిపై పట్టు బిగించారు. కాగా తాము 30 మంది ఆఫ్ఘన్ సైనికులను కాల్చి చంపినట్టు వచ్చిన ఆరోపణలను వారు ఖండించారు. ఘర్షణల్లో వారు మరణించారని పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: India Covid-19: దేశంలో భారీగా పెరిగిన మరణాల సంఖ్య.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం కన్వీనర్‌ కోటా..