ఆఫ్ఘన్ దళాలకు మద్దతుగా వైమానిక దాడులు కొనసాగుతాయి.. అమెరికా టాప్ జనరల్ క్లారిటీ

ఆఫ్గనిస్తాన్ లో ఆ దేశ దళాలకు మద్దతుగా తాలిబన్లపై తమ వైమానిక దాడులు కొనసాగుతాయని అమెరికా టాప్ జనరల్ ఒకరు ప్రకటించారు. తాలిబన్లు ఆ దేశంలో పలు జిల్లాలను..

ఆఫ్ఘన్ దళాలకు మద్దతుగా వైమానిక దాడులు కొనసాగుతాయి.. అమెరికా టాప్ జనరల్ క్లారిటీ
Talibans
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 26, 2021 | 8:56 AM

ఆఫ్గనిస్తాన్ లో ఆ దేశ దళాలకు మద్దతుగా తాలిబన్లపై తమ వైమానిక దాడులు కొనసాగుతాయని అమెరికా టాప్ జనరల్ ఒకరు ప్రకటించారు. తాలిబన్లు ఆ దేశంలో పలు జిల్లాలను, బోర్డర్ క్రాసింగ్స్ ను, ప్రొవిన్షియల్ క్యాపిటల్స్ ను స్వాధీనం చేసుకుంటున్నారని కానీ రానున్న రోజుల్లో వారిపై వైమానిక దాడులను ఉధృతం చేస్తామని జనరల్ కెనెత్ మెకెంజీ తెలిపారు. గత కొన్ని రోజులుగా వీటిని కొనసాగిస్తున్నప్పటికీ ఇక వీటి ఉధృతి పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్న విషయాన్ని అయన అంగీకరించారు. తాలిబన్లు విజయం సాధించలేరని, కానీ అదే సమయంలో ఆఫ్ఘన్ దళాలు కూడా వారిని ఎదుర్కోవడంలో ‘ఇబ్బంది పడుతున్నారని’ ఆయన వ్యాఖ్యానించారు. ఆగస్టు 31 తరువాత అమెరికా బలగాలు ఆ దేశం నుంచి పూర్తిగా వైదొలగినప్పటికీ ఆ దేశ వైమానిక దళానికి తమ సపోర్టు ఉంటుందని జనరల్ మెకెంజీ ప్రకటించారు. ఇప్పటివరకు దీనిపై ఉన్న అనుమానాలను ఆయన తొలగించారు.తాలిబన్లకు ఐసిస్, అల్-ఖైదా మద్దతునిస్తున్నాయని కూడా ఆయన చెప్పారు. వారిపై ఆఫ్ఘన్ సేనలకు విజయం సాధించడం కష్ట సాధ్యం కావచ్చునని అభిప్రాయపడ్డారు.

కాందహార్ లో నెల రోజులు కాలంలో 22 వేల కుటుంబాలు ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి. మరిన్ని కుటుంబాలను ఖాళీ చేయిస్తున్నామని శరణార్థి విభాగం హెడ్ దోస్త్ మహమ్మద్ దర్యాబ్ వెల్లడించారు. కాగా-నిన్న కూడా కాందహార్ శివార్లలో ఆఫ్ఘన్ సైనికులకు, తాలిబాన్లకు మధ్య పోరు జరిగింది. ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని , మరి కొందరు అధికారులు అధ్యక్ష భవనం వద్ద ప్రార్థనలు చేసుకుంటుండగా మూడు రాకెట్లు సమీప ప్రాంతాల్లో పడినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Alia Bhatt: ముంబైకి పయనమైన ముద్దుగుమ్మ.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆలియా..

VIRAL VIDEO : ప్రపంచంలో తల్లికి మించిన యోధులు మరెవరు లేరు..! ఐదు పిల్లలు పడిపోకుండా గోడపై నడుస్తున్న ఒపోసమ్