హాట్ మోడల్ ఫాతిమివ్ డేవిలా అనుమానాస్పద మృతి

మిస్ యూనివర్స్ ఉరుగ్వే ఫాతిమివ్ డేవిలా అనుమానాస్పదంగా మృతి చెందింది. ఉరుగ్వే దేశం తరుపు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న 31 ఏళ్ల ఫాతిమివ్ డేవిలా… మెక్సికోలో నివాసం ఉంటోంది. మోడలింగ్ పని మీద మెక్సికోలోని ఏప్రిల్ 23న ఓ హోటెల్‌లో దిగింది. గురువారం ఆ హోటెల్‌లో బాత్రూమ్‌లో ఆమె చనిపోయి ఉండడాన్ని గుర్తించారు హోటల్ సిబ్బంది. ఆమె ఎలా చనిపోయిందన్నవివరాలు ఇంకా తెలియలేదు. మోడలింగ్ పని మీద వివిధ దేశాలు తిరుగుతూ ఉండే […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:58 am, Sat, 4 May 19
హాట్ మోడల్ ఫాతిమివ్ డేవిలా అనుమానాస్పద మృతి

మిస్ యూనివర్స్ ఉరుగ్వే ఫాతిమివ్ డేవిలా అనుమానాస్పదంగా మృతి చెందింది. ఉరుగ్వే దేశం తరుపు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న 31 ఏళ్ల ఫాతిమివ్ డేవిలా… మెక్సికోలో నివాసం ఉంటోంది. మోడలింగ్ పని మీద మెక్సికోలోని ఏప్రిల్ 23న ఓ హోటెల్‌లో దిగింది. గురువారం ఆ హోటెల్‌లో బాత్రూమ్‌లో ఆమె చనిపోయి ఉండడాన్ని గుర్తించారు హోటల్ సిబ్బంది. ఆమె ఎలా చనిపోయిందన్నవివరాలు ఇంకా తెలియలేదు. మోడలింగ్ పని మీద వివిధ దేశాలు తిరుగుతూ ఉండే ఫాతిమివ్ డేవిలా… ఎంతో అభిమానులను కూడా సొంతం చేసుకుంది. మే 2వ తేదీన హోటెల్ గదిలోని బాత్రూమ్‌లో ఫాతిమివ్ డేవిలా… చనిపోయి ఉండడాన్ని గుర్తించిన సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఫాతిమివ్ డేవిలా ఆత్మహత్య చేసుకుందా… లేక ఎవ్వరైనా హత్య చేసి ఉంటారా? అనేది తెలియరాలేదు. బాత్రూమ్‌లో ప్రమాదవశాత్తు కాలు జారి ప్రాణాలు కోల్పోయిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.