Fearless Woman Video : మా గడ్డపై మీకేం పని..? రష్యన్‌ సైనికుడి గుండెళ్లో ఉక్రెయిన్ మహిళ మాటల తూటాలు..

ఈ దేశంలో మీకేం పని..? ఇదే ప్రశ్న లక్షల గొంతుకలొక్కటై గర్జిస్తోన్న ప్రశ్న. ఓ మహిళ హృదయంలో నుంచి వచ్చిన ప్రశ్న.. ఆ ఆధిపత్య దేశ సైనికుడి గుండెల్లో సూటిగా దిగింది.

Fearless Woman Video : మా గడ్డపై మీకేం పని..? రష్యన్‌ సైనికుడి గుండెళ్లో ఉక్రెయిన్ మహిళ మాటల తూటాలు..
Woman In Henichesk Confront
Follow us

|

Updated on: Feb 25, 2022 | 7:25 PM

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో పోరు హోరిగా సాగుతోంది.. రష్యా ఆర్మీ దాడితో దేశమంతా రణరంగంగా మారింది.. రాజధాని కీవ్‌పై దాడికి రష్యాస్పెషల్‌ గెరిల్లా ఫోర్స్‌ రెడీ అయింది.. రాజధానికి 5 కిలోమీటర్ల దూరంలో రష్యా దళాల కదలికలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే కీవ్‌లో బాంబుల మోత కొనసాగుతోంది.. కీవ్‌ స్వాధీనం ద్వారా ఉక్రెయిన్‌పై పూర్తి పట్టు సాధించాలని భావిస్తోంది రష్యా. తమ దేశాన్ని శత్రువుల బారి నుంచి రక్షించుకునేందుకు సిద్దమయ్యారు ఉక్రెయిన్‌ పౌరులు.. సైన్యంతో పాటుగా సాధారణ పౌరులు కూడా ఆయుధాలు పట్టారు.. ఇంతకీ ఎందుకీ యుద్ధం..! ఈ దేశంలో మీకేం పని..? ఇదే ప్రశ్న లక్షల గొంతుకలొక్కటై గర్జిస్తోన్న ప్రశ్న. ఓ మహిళ హృదయంలో నుంచి వచ్చిన ప్రశ్న.. ఆ ఆధిపత్య దేశ సైనికుడి గుండెల్లో సూటిగా దిగింది. మా గడ్డపై మీకేం పని..? తమ మట్టిలో రక్తపుటేరులు పారిస్తోన్న ఓ రష్యన్‌ సైనికుడికి ఉక్రెయిన్‌ మహిళ వేసిన ఈ ప్రశ్నకి వేలాది యుద్ధట్యాంకుల్ని బద్దలు చేసే శక్తుంది. ఓ వైపు యుద్ధ ట్యాంకులు.. మరో వైపు సైనికుడిని నిలదీసింది. మా మట్టిమీద అడుగుపెట్టేందుకు మీకెవరిచ్చారీ అధికారం. మేం అడగకుండానే, మా గడ్డపై కాలుమోపి, ఎందుకీ మారణహోమం సృష్టిస్తున్నారు? అంటూ హెనీచెస్క్‌, ఖేర్సన్‌ ప్రాంతాల్లో జరుగుతోన్న మారణహోమంపై రష్యన్‌ సైనికుడిపై మాటల తూటాలతో దాడిచేసిందీ ఆ మహిళ.

తమ దేశ దురాక్రమణకు పాల్పడుతూ, నిలువెల్లా అత్యాధునిక ఆయుధాలతో సాయుధుడై ఉన్న మాస్కో సైనికుడిని ఏ జంకూ గొంకూ లేకుండా నిలదీస్తోన్న ఈ మహిళ ఇప్పుడు కోటానుకోట్ల యుద్ధ వ్యతిరేకులకు ప్రత్యక్ష సాక్ష్యంలా నిలుస్తోంది.

ఈ భూమిని ఆక్రమించే ముందు.. నీ జేబులో కొన్ని పూల విత్తనాల్ని వేసుకో..

నీ మరణానంతరం శాంతిపరిమళాల్ని వెదజల్లే పువ్వులై పూస్తాయవి

– ఉక్రెయిన్‌ మట్టిలో పుట్టిన ఓ తల్లి రష్యా సైనికుడితో అన్నటువంటి మాటలివి.

రష్యా సైనికుడిని ఉక్రెయిన్ మహిళ ప్రశ్నిస్తున్న వీడియోను ఇక్కడ చూడండి..

ఉక్రెయిన్‌ సరిహద్దు దాటిన రష్యా బలగాలు ఇప్పటికే చాలా ప్రాంతాలను తన ఆక్రమించుకున్నాయి. ఇందులో భాగంగా హెన్‌చెస్క్‌ నగరంలో రష్యా సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ ఉక్రెయిన్‌ మహిళ, భారీ ఆయుధాలు కలిగి ఉన్న ఓ సైనికుడి వద్దకు వెళ్లి “నీవెవరూ..? అంటూ ప్రశ్నించింది. మేం కవాతు చేస్తున్నాం.. మీరు వెళ్లిపోండి అంటూ అతడు జవాబిచ్చారు. అయితే, సదరు వ్యక్తి రష్యా సైనికుడని అర్థం చేసుకున్న ఆ మహిళ.. మీరు ఇక్కడేం చేస్తున్నారు..? అంటూ మరోసారి గట్టిగా ప్రశ్నించింది. ఆ మహిళ వేసిన ప్రశ్నకు రష్యా సైనికుడు స్పందించాడు. “మనం వాదించుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు..” అంటూ ఆ సైనికుడు బదులిచ్చాడు. అతడి మాటలకు భయపడకుండా మరో అడుగు ముందుకేసిన ఆ మహిళ.. ‘మీరు ఆక్రమణదారులు, మీరు నియంతృత్వవాదులు, ఇలాంటి ఆయుధాలను పట్టుకొని మా పురిటి గడ్డమీద ఏం చేస్తున్నారు? ఈ విత్తులు తీసుకొని జేబులో వేసుకో. నేలకొరిగిన తర్వాత కనీసం పొద్దుతిరుగుడు (ఉక్రెయిన్‌ జాతీయ పుష్పం “పొద్దుతిరుగుడు” ) పువ్వులైనా పూస్తాయి..’ అంటూ రష్యా సైనికుడి గుండెళ్లో మాటల తూటాలను దింపేసింది.

కీవ్స్‌ సమీపంలోని ఓడరేవు నగరమైన హెనిచెస్క్‌లోని వీధుల్లోకి వస్తున్న రష్యా బలగాలకు ఈ ఉక్రెయిన్‌ మహిళ ఎదురు నిలిచి ప్రశ్నల వర్షం కురిపించడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడిదే వీడియో ప్రపంచవ్యాప్తంగా ప్రతిహృదయాన్నీ తట్టిలేపుతోంది ఈ మహిళ వేసిన ప్రశ్న. ఆ మట్టిలో పుట్టి ఆ మట్టిలో పెరిగిన ఓ ఉక్రెయిన్‌ మహిళ తమ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తోన్న రష్యా సైనికుడిని నిలదీసింది. మా అనుమతి లేకుండా ఎందుకొచ్చారు మా దేశానికి? ఏ ప్రయోజనానికీ యుద్ధం. అన్నది ఆమె మాటల్లోని సారాంశం.

మీరు మీ జేబుల్లో కొన్ని సన్‌ఫ్లవర్‌ విత్తనాలు వేసుకోండి. ఈ మట్టిలో మీరు కలిసిపోయినప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తుతాయంటున్న ఆ మహిళ సంభాషణను ఓ న్యూస్‌ ఏజెన్సీ ప్రపంచానికి వెల్లడించింది. బహుశా ఆ విత్తనాలు శాంతి పరమిళాల్ని వెదజల్లాలన్నది ఆమె ఆకాంక్ష కాబోలు. తమపై దురాక్రమణకు పాల్పడి తమ జీవితాల్లో విధ్వంసం సృష్టించిన శతృదేశం మట్టికరవాలన్న తృణీకారమైనా కావొచ్చు. ఇప్పుడు ఉక్రెయిన్‌ వాసుల మనోగతం ఇదే..

ఇవి కూడా చదవండి: Russia Ukraine War: ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్‌ను కూల్చేస్తాం.. యూరప్, అమెరికాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్..

 Dental Care: దంతాలు పసుపురంగులో ఉన్నాయా..? అయితే ఈ ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలు తెల్లగా మారిసిపోతాయి..

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!