Russia – Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై సంచలన ప్రకటన చేసిన ఆ ముగ్గురు దేశాధినేతలు..!

Russia - Ukraine: యుద్ధంతో కకావికలమైన ఉక్రెయిన్‌కు ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ సంఘీభావం ప్రకటించాయి. ఈ మూడు దేశాల అధ్యక్షులు కలసి ఉక్రెయిన్‌లో

Russia - Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై సంచలన ప్రకటన చేసిన ఆ ముగ్గురు దేశాధినేతలు..!
Ukraine Russia War
Follow us

|

Updated on: Jun 17, 2022 | 6:13 AM

Russia – Ukraine: యుద్ధంతో కకావికలమైన ఉక్రెయిన్‌కు ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ సంఘీభావం ప్రకటించాయి. ఈ మూడు దేశాల అధ్యక్షులు కలసి ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ అధినేతలు మాక్రాన్‌, షోల్జ్‌, ద్రాగి.. ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈ ముగ్గురు దేశాధినేతలు ముందుగా ఉక్రెయిన్‌లోని రష్యా దాడులతో రూపురేఖలు కోల్పోయిన ఇర్పిన్‌ ప్రాంతాన్ని సందర్శించారు. రష్యా దాడులతో అక్కడ శిథిమైన భవనాలను, జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత రాజధాని కీవ్‌కి వెళ్లి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీతో చర్చలు జరిపారు.

పోలాండ్‌ నుంచి 10 గంటలు రైలులో ప్రయాణించి కీవ్‌ చేరుకున్నారు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌. యూరోపియన్‌ ఐక్యత, ఉక్రెయిన్‌కు మద్దతుపై మెసేజ్‌ ఇవ్వడానికే వచ్చానని చెప్పారు మాక్రాన్‌. ఉక్రెయిన్‌ ఈ యుద్ధం గెలవాలని ఆకాంక్షించారు. రష్యాను అవమానించడం కరెక్ట్‌ కాదని గతంలో కామెంట్ చేసిన మాక్రాన్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో ఎలాంటి సందిగ్ధం లేకుండా ప్రకటన చేశారు మాక్రాన్‌. అలాగే ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలుపడానికే వచ్చామని జర్మనీ ఛాన్సలర్‌ షోల్జ్‌ కూడా వస్తూ వస్తూ ట్రైన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా విషయంలో జర్మనీపై విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక, మానవీయ సాయంతో పాటు ఉక్రెయిన్‌ స్వాతంత్ర్యం కోసం అవసరమైనంత వరకు ఆయుధాలు కూడా సరఫరా చేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

మిగతా యూరోపియన్‌ నాయకుల మాదిరిగానే మాక్రాన్‌, షోల్జ్‌, ద్రాగి కూడా కీవ్‌ శివారులోని ఇర్పిన్‌ వీధుల్లో కలియతిరిగి బాంబు దాడుల్లో నామరూపాలు లేకుండా పోయిన భవనాల ముందు ఆగి పరిశీలించారు. వాటి గురించి గైడ్‌లను ప్రశ్నలు అడిగారు. తర్వాత రాజధాని నగరం కీవ్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌ స్కీతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితులపై వారు చర్చించారు. రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన పై దాడిని ప్రారంభించింది. ఉక్రెయిన్‌ చిన్న దేశమే అయినా రష్యాను ప్రతిఘటిస్తూ వస్తోంది. 20 శాతం ఉక్రెయిన్‌ భూభాగం రష్యా చేతిలో ఉందని ఇటీవలే జెలన్‌ స్కీ చెప్పారు.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్