UK PM Race: రసవత్తరంగా సాగుతున్న బ్రిటన్‌ ప్రధాని రేస్‌.. మరో అడుగు దూరంగా రిషి సునక్‌, లిజ్‌ ట్రస్‌..!

UK PM Race:బ్రిటన్‌ ప్రధాని రేసులో ఇప్పుడు భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్‌, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ఉన్నారు. ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి..

UK PM Race: రసవత్తరంగా సాగుతున్న బ్రిటన్‌ ప్రధాని రేస్‌.. మరో అడుగు దూరంగా రిషి సునక్‌, లిజ్‌ ట్రస్‌..!
Follow us

|

Updated on: Jul 28, 2022 | 11:00 AM

UK PM Race:బ్రిటన్‌ ప్రధాని రేసులో ఇప్పుడు భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్‌, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ఉన్నారు. ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన తొలి టెలివిజన్‌ డిబేట్‌లో విజేత ఎవరో తేలలేదు. బ్రిటన్‌ ఆర్థిక విధానాలు, పన్ను ప్రణాళికపై కొంత వాగ్వివాదం జరిగింది. సోమవారం రాత్రి బీబీసీ చర్చలో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో సునక్‌కు 39 శాతం, ట్రస్‌కు 38 శాతం ఓట్లు వచ్చాయి. సునక్‌ కొంత ఆధిక్యంలో ఉన్నారనే చెప్పాలి. అయితే కన్జర్వేటివ్‌ పార్టీ ఓటర్లలో 47 శాతం మంది విదేశాంగ మంత్రి ట్రస్‌కు అనుకూలంగా, 38 శాతం మంది సునక్‌ అనుకూలంగా ఓటు వేశారు. ఒపీనియన్‌ పోల్‌లో మొత్తం 1,032 మంది యూకేకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఇద్దరి మధ్య చూస్తే ఒక్క శాతం మాత్రమే తేడా ఉంది. ప్రజాభిప్రాయం సేకరణలో భాగంగా ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కి 41 శాతం, సునక్‌కు 42 శాతం ఉంది. 30 శాతం మంది ట్రస్‌ మెరుగైన పని తీరు ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే పోల్‌ చేసిన వారిలో 43 శాతం మంది కన్జర్వేటివ్‌లు సునాక్‌ను ఎంచుకోవాలని, 41 శాతం మంది ట్రస్‌ను ఎంచుకోవాలని చెప్పారు.ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 12 శాతం మంది ఎవరినీ ఎన్నుకోలేదు.

చర్చలో పాల్గొన్న వీరిద్దరి మధ్య అనేక వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. రిషి సునక్, లిజ్ ట్రస్ మధ్య టీవీలో జరిగిన చర్చలో చైనాతో సంబంధాల విషయం వచ్చినప్పుడు ఇద్దరు అభ్యర్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బ్రిటన్ ఆర్థిక భద్రతకు చైనా ముప్పుగా అభివర్ణించిన సునక్.. మన విలువల కోసం మనం నిలబడాల్సిన సమయం ఇది అని అన్నారు. ఆర్థిక వ్యవస్థ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నెలకొంది.

ఉక్రెయిన్‌ సమస్యపై..

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్‌ నుంచి ధాన్యం ఎగుమతులను రక్షించడానికి రాయల్‌ నేవీ పంపబడుతుందా..? అనే ప్రశ్న అడిగినప్పుడు సునాక్‌, ట్రస్‌ మధ్య ఐక్యత కనిపించింది. దీనికి అభ్యర్థులిద్దరూ ఈ విషయాన్ని చెప్పేందుకు నిరాకరించారు. అలాగే రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో రాయల్‌ నేవిని రంగంలోకి దింపుతారా..? అంటే ఈ వివాదంలో బ్రిటన్‌ కలుగజేసుకునే విధంగా సిద్ధంగా లేనని ట్రస్‌ చెప్పగా, అదే సమయంలో ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయం అందజేస్తామని సునక్‌ చెప్పారు.

పన్ను తగ్గింపుపై..

జీవన వ్యయం విషయంలో సంక్షోభం తీవ్రమవుతున్నందున పన్ను తగ్గింపులపై చర్యలు తీసుకుంటామని ఇద్దరు చెప్పుకొచ్చారు. అయితే సునక్‌ తన ప్రత్యర్థు తక్షణ పన్ను తగ్గింపుల వాగ్దానాలను కొట్టిపారేశారు. ముందు ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావాలని వాదించారు. మరో వైపు ట్రస్‌ మొదటి రోజున నుంచి పన్నులను తగ్గించడం ప్రారంభిస్తామని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు