ట్విట్టర్ సీఈవో అకౌంట్ హ్యాక్ చేసి ఏం చేశారంటే..!

ట్విట్టర్ సీఈవో అకౌంట్ హ్యాక్ చేసి ఏం చేశారంటే..!

ప్రపంచవ్యాప్తంగా హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. వీరు, వారు తేడా లేకుండా ప్రతి ఒక్కరి అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా ట్విట్ట‌ర్ సంస్థ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డార్సే అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఆ తరువాత సుమారు 15 నిమిషాలు పాటు కొన్ని జాత్యాహంకార ట్వీట్లు డార్సే అకౌంట్ నుంచి పోస్టు అయ్యాయి. వాటిని రీట్వీట్ చేసిన‌ట్లుగా కూడా పోస్టులు ఉన్నాయి. నాజీల ఊచ‌కోత‌కు సంబంధించిన ట్వీట్లు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అయితే చివ‌ర‌కు […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Aug 31, 2019 | 3:49 PM

ప్రపంచవ్యాప్తంగా హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. వీరు, వారు తేడా లేకుండా ప్రతి ఒక్కరి అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా ట్విట్ట‌ర్ సంస్థ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డార్సే అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఆ తరువాత సుమారు 15 నిమిషాలు పాటు కొన్ని జాత్యాహంకార ట్వీట్లు డార్సే అకౌంట్ నుంచి పోస్టు అయ్యాయి. వాటిని రీట్వీట్ చేసిన‌ట్లుగా కూడా పోస్టులు ఉన్నాయి. నాజీల ఊచ‌కోత‌కు సంబంధించిన ట్వీట్లు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

అయితే చివ‌ర‌కు సైట్‌ను మ‌ళ్లీ ఆధీనంలోకి తీసుకువ‌చ్చామని ట్విట్ట‌ర్ ప్ర‌క‌ట‌న చేసింది. అకౌంట్‌ను సెక్యూర్ చేశామ‌ని, ట్విట్ట‌ర్ సిస్ట‌మ్స్ బాగానే ఉందని సంస్థ అధికారులు వెల్లడించారు. ఇక ఈ అకౌంట్‌ను డార్సే తామే హ్యాక్‌ చేశామంటూ చెక్లింగ్ స్క్వాడ్ అనే గ్రూపు ప్ర‌క‌ట‌న చేసింది. కాగా జాక్ ట్విట్ట‌ర్ అకౌంట్‌కు సుమారు 40 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. చక్లింగ్ స్క్వాడ్ అనే హ్యాక‌ర్స్ ఇటీవ‌ల ఎక్కువగా హై ప్రొఫైల్ అకౌంట్ల‌ను హ్యాక్ చేస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu