Pakistan: ఉగ్రవాద స్వర్గధామం పాకిస్తాన్.. ఇప్పుడు అదే తీవ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది!

ఉగ్రవాదానికి స్వర్గధామమైన పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదంతో తల్లకిందులు అవుతోంది. అక్కడ నివసించే ఉగ్రవాదులు అక్కడి ప్రజలనే టార్గెట్ చేసుకున్నారు.

Pakistan: ఉగ్రవాద స్వర్గధామం పాకిస్తాన్.. ఇప్పుడు అదే తీవ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది!
Ttp Terrorists In Pakistan
Follow us

|

Updated on: Oct 15, 2021 | 1:48 PM

Pakistan: ఉగ్రవాదానికి స్వర్గధామమైన పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదంతో తల్లకిందులు అవుతోంది. అక్కడ నివసించే ఉగ్రవాదులు అక్కడి ప్రజలనే టార్గెట్ చేసుకున్నారు. దీంతో తాను తీసుకున్న గోతిలో అన్నట్టుగా పాక్ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ అన్నివైపులా సమస్యలతో సతమతం అవుతోంది. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం.. ఉగ్రవాదుల దాడులు.. మరో పక్క తాను ఏరికోరి సహాయం చేసిన తాలిబన్ల నుంచి అందని సహకారం అన్నీ భూతాలుగా మరి పాకిస్తాన్ మీద విరుచుకుపడుతున్నాయి. పాకిస్తాన్ పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారాన్ని ఆక్రమించడంతో..స్లామిక్ స్టేట్ ఖోరాసన్ పెరుగుతున్న కార్యకలాపాలు ఇప్పుడు పాకిస్తాన్‌పై కూడా ప్రభావం చూపుతోంది.

BBC వార్తల ప్రకారం, పాకిస్తాన్‌లో పెరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఇస్లామాబాద్‌లోని ఒక పరిశోధనా సంస్థ పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (PIPS) సేకరించింది. దాని నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం పాకిస్తాన్‌లో హింస పెరిగింది. అఫ్గాన్ తాలిబాన్ అడుగుజాడలను అనుసరించే తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ, పాకిస్తాన్‌లో పెరుగుతున్న తీవ్రవాద సంఘటనల వెనుక ఉంది. ఈ సంస్థ ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ చేసినట్లుగానే పాకిస్థాన్‌లో కూడా షరియా చట్టాన్ని అమలు చేయాలనుకుంటోంది.

ఏడు గిరిజన జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి..

ఈ తీవ్రవాద సంఘటనలు ఎక్కువగా పాకిస్తాన్‌లోని ఏడు గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నాయి. వీటిలో ఒరక్జాయ్, బజౌర్, మొహమాండ్, ఖైబర్, కుర్రం, ఉత్తర వజీరిస్తాన్ మరియు దక్షిణ వజీరిస్తాన్ ఉన్నాయి.

ఒక సంవత్సరంలో 95 దాడులు..

గత ఏడాది పాకిస్థాన్‌లో టిటిపి(TTP) 95 దాడులు చేసిందని, ఇందులో 140 మంది మరణించారని PIPS డేటా చూపిస్తుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 44 దాడులు జరిగాయి. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకోవడంతో, పాకిస్తాన్‌లో టిటిపి ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతూనే ఉన్నాయి. జూలై, సెప్టెంబర్ మధ్య, ఈ బృందం మరో 44 దాడులు చేసింది, ఇందులో 73 మంది మరణించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది పాకిస్తాన్ పోలీసులు, పాలనలో ఉన్న వ్యక్తులు ఉన్నారు.

ఆయా ప్రాంతాల్లో భయం.. ఉద్రిక్తత..

కేవలం హింస మాత్రమే కాదు, చాలా నెలలుగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉద్రిక్తత, భయనక వాతావరణం ఉంది. చాలా మంది పౌరులు తమకు డబ్బు డిమాండ్ చేస్తూ ఆఫ్ఘన్, పాకిస్తాన్ నంబర్ల నుండి కాల్స్ వస్తున్నాయని చెప్పారు. బజౌర్ జిల్లాలో ఒక వ్యాపారవేత్త, ఒక సాంఘిక సంక్షేమ కార్యకర్త తనకు జూలై, ఆగస్టులో వేర్వేరు నంబర్ల నుండి కాల్స్ వచ్చాయని చెప్పారు. కాల్ చేసిన వారు తమను తాలిబాన్లుగా గుర్తించి డబ్బులు అడిగేవారు. అతను దీని గురించి స్థానిక అధికారులకు చెప్పినప్పుడు, ప్రతి వ్యక్తికి భద్రత కల్పించడం అంత సులభం కాదని, అందువల్ల అతను తనను తాను కాపాడుకోవాల్సి ఉంటుందని చెప్పారని చెబుతున్నాడు. దీనిని బట్టి అక్కడి ప్రస్తుత పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

Also Read: IT Returns: ఐటీ రిటర్న్స్ పోర్టల్ సమస్యలు పరిష్కారం.. రెండుకోట్లకు పైగా రిటర్న్స్ దాఖలు.. వెల్లడించిన సీబీడీటీ!

Dasara 2021: సీసాలో దుర్గామాత.. ఆకట్టుకుంటున్న ఒడిశా కళాకారుని అద్భుత మీనియేచర్ సృష్టి!

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్