Tsunami Alert: సునామి భయంతో వణికిపోతున్న పశ్చిమ దేశాలు.. బద్దలైన అగ్ని పర్వతం..!

Tsunami Alert: సునామి భయంతో పశ్చిమ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏ ఆల వచ్చి మీద పడుతుందోననే టెన్షన్‌ నెలకొంది...

Tsunami Alert: సునామి భయంతో వణికిపోతున్న పశ్చిమ దేశాలు.. బద్దలైన అగ్ని పర్వతం..!
Follow us

|

Updated on: Jan 17, 2022 | 7:14 AM

► బద్దలైన అగ్ని పర్వతం

► 8 నిమిషాల పాటు పేలుడు శబ్ధాలు

► అలలకు పడవలు ధ్వంసం

► సునామి హెచ్చరికలతో భయం.. భయం

Tsunami Alert: సునామి భయంతో పశ్చిమ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏ ఆల వచ్చి మీద పడుతుందోననే టెన్షన్‌ నెలకొంది. ఇల్లూ వాకిలి వదిలేసి ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు జనం. దీనంతటికీ కారణం అగ్ని పర్వతం పేలుడు. యస్‌. పిసిపిక్‌ మహాసముద్రంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో తీర ప్రాంతాల్లోకి పసిపిక్‌ మహాసముద్రం చొచ్చుకొస్తుంది. తీరప్రాంత ప్రజలు ఎత్తయిన ప్రదేశానికెళ్లాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.

బద్దలైన భారీ అగ్ని పర్వతం:

దక్షిణ పసిఫిక్‌ సముద్రంలోని ద్వీపకల్పం టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. టోంగా రాజధాని నుకులోఫాలోకి 65కి.మీ దూరంలో సముద్ర గర్భంలో ఉన్న టోంగా హుంగా హాపై అనే అగ్ని పర్వతం ఒక్కసారిగా విస్ఫోటం చెందింది. దీంతో టోంగా వ్యాప్తంగా పొగ, బూడిద ఎగిసిపడ్డాయి. సముద్ర గర్భం నుంచి బయటకొచ్చిన బూడిద 20కి.మీ వరకు ఎగిసిపడ్డట్లు టోంగా జియోలాజికల్‌ సర్వే సంస్థ తెలిపింది.

హుంగా టోంగా-హుంగా హాపై అగ్నిపర్వత శ్రేణి పేలుళ్లలో ఇది తాజా విస్పోటం అని అంటున్నారు నిపుణులు. 8 నిమిషాల పాటు సంభవించిన ఈ పేలుడు బీభత్సంగా ఉందని, దీనికి 800 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఫిజీలో పెద్ద ఉరుముల్లాంటి శబ్దాలు వినిపించాయని చెబుతున్నారు అధికారులు. అగ్నిపర్వతం బద్దలవడం వల్ల వెలువడిన వాయువులు, పొగ, బూడిద ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించాయని చెప్పింది టోంగా జియోలాజికల్ సర్వీసెస్.

8 నిమిషాల పాటు అగ్నిపర్వతం పేలుడు శబ్దాలు:

అగ్నిపర్వతం పేలుడు శబ్దాలు 8 నిమిషాలపాటు వినిపించినట్లు పేర్కొంది. మరోవైపు పేలుడు ధాటికి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో టోంగాతోపాటు జపాన్‌, ఫిజీ, హవాయి, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, చిలీ, అలస్కాసహా యూఎస్‌ పశ్చిమ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియాకు కూడా అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు చేసింది. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. అగ్నిపర్వత విస్ఫోటనం.. భూకంప తీవ్రతతో పోలిస్తే రిక్టర్‌ స్కేలుపై 5.8గా ఉంటుందని అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. విస్ఫోటనం ధాటికి జపాన్‌ పసిఫిక్‌ కోస్టల్‌ ప్రాంతంలో అలలు 1.2 మీటర్ల ఎత్తు ఎగిసిపడ్డాయని అక్కడి వాతావారణ శాఖ తెలిపింది. టోంగాకు 2,300 కి.మీ దూరంలో ఉన్న న్యూజిలాండ్‌పై కూడా దీని ప్రభావం పడింది.

అలలకు పడవలు ధ్వంసం:

అలలకు అక్కడి తీర ప్రాంతంలో ఉన్న పడవలు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన అక్కడి అధికారులు తీరప్రాంతంలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు ప్రాంతాల్లో బలమైన, అసాధారణమైన వరదలు, తీర ప్రాంతాల్లో అనూహ్యమైన ఉప్పెనలు వచ్చే అవకాశముందని హెచ్చరించింది న్యూజిలాండ్‌ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ. ఆశ్చర్యకర రీతిలో శక్తి విడుదల అయిందని ట్వీట్ చేసింది వెదర్ వాచ్. దీంతో టోంగా, ఫిజీ, న్యూజీలాండ్ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

భారీ శబ్ధంతో భూకంపం:

నాలుగు అడుగుల ఎత్తుతో అలలు ఎగసిపడగా.. టోంగా రాజధాని నుకువాలోఫా ప్రజలు వణికిపోయారు. భారీ శబ్ధంతో భూమీ కంపించడంతో పాటు సముద్రపు నీరు నగరంలోకి చొచ్చుకుని వచ్చిందని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్‌ మెటియోరాలజీ ప్రకటించింది. టోంగా రాజు ప్యాలెస్‌ నుంచి ఇప్పటికే సురకక్షిత ప్రాంతానికి తరలిపోగా.. తన పౌరులను అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపు ఇచ్చాడు.

తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు..

మరోవైపు అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున అమెరికా, జపాన్‌, సైతం ఇప్పుడు సునామీ హెచ్చరికలతో అప్రమత్తం అయ్యాయి. జపాన్‌ తీర ప్రాంతం వెంబడి 11 అడుగుల మేర అలలు ఎగసిపడే అవకాశం ఉందని భావిస్తోంది వాతావరణ సంస్థ. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తోంది. మరోవైపు అమామీ ఒషీమా ద్వీపంలోకి 1.2 మీటర్‌ ఎత్తుతో అలలు ఎగసిపడినట్లు తెలుస్తోంది. అమెరికా, కెనడా పశ్చిమ తీరం వెంట సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియా, అలస్కా వెంట చిన్నపాటి వరదల దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హవాయ్‌ అప్రమత్తం అయ్యింది. ఓరేగావ్‌ తీరం వెంట సముద్రపు అలలు ముందుకు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

NRI: విదేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారా.? మీ బ్యాంక్ ఖాతాను మార్చుకోవాల్సిందే.. ఈ విషయాలు తెలుసుకోండి!

Gaddam Meghana: న్యూజిలాండ్‌లో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం.. 18 ఏళ్లకే పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక