ఫ్లూ టీకాతో తగ్గనున్న ఆ రెండు జబ్బులు

కొత్తగా తయారైన ఫ్లూ టీకాతో రెండు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చునని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్ అధ్యయనం వెల్లడించింది.

ఫ్లూ టీకాతో తగ్గనున్న ఆ రెండు జబ్బులు
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 8:34 PM

Flu Vaccine: కొత్తగా తయారైన ఫ్లూ టీకాతో రెండు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చునని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్ అధ్యయనం వెల్లడించింది. ఫ్లూ టీకా వలన గుండె జబ్బులు, అల్జిమర్స్‌(మతిమరుపు) వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తెలిపింది. కరోనాను నియంత్రించేందుకు ఫ్లూ వ్యాక్సిన్‌ ఉపయోగపడుతుందని ఇటీవల నిపుణులు తెలిపారు. ఈ సందర్భంగా చేసిన అధ్యయనంలో మరిన్ని ఆశ్యర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఒక ఫ్లూ వ్యాక్సిన్‌తో 17శాతం, మరో  ఫ్లూ వ్యాక్సిన్‌తో 13శాతం అల్జీమర్స్‌ ప్రమాదంను తగ్గించుకోవచ్చునని వెల్లడించింది.

ఇక 65, 75 సంవత్సరాల వయస్సుల వారికి నిమోనియా టీకా వలన 40శాతం అల్జీమర్స్‌ వ్యాధి తగ్గిందని తెలిపింది. ఎవరైతే బాల్యంలో ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకున్నారో.. వారికి రోగనిరోధక శక్తి అధికంగా ఉందని, జన్యుపరమైన ఇబ్బందులు లేనివారికి ఈ వ్యాక్సిన్‌ అద్భుతంగా పనిచేస్తుందని అధ్యయనంలో తేలింది. ఇక ఫ్లూ వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి తీవ్ర గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం 28శాతం తగ్గుతుందని, 73శాతం మంది చనిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కుతారని వివరించింది.

Read This Story Also: పూజా పాత్రలో జాన్వీ!