భారీ ట్రక్కులో 39 మృత దేహాలు,, ఏంటా మిస్టరీ ?

లండన్ దగ్గరలోని గ్రేస్ ఇండస్ట్రియల్ పార్కులో ఓ భారీ ట్రక్కు మెల్లగా ప్రయాణిస్తూ అనుమానాస్పదంగా కనబడడంతో పోలీసులు దాన్ని ఆపారు. ఈ వాహనం లోపల చూసి.. వారు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. అందులో 39 మృత దేహాలున్నాయి. బల్గేరియా నుంచి ఈ ట్రక్కు వస్తున్నట్టు భావిస్తున్నారు. ఓ టీనేజర్ తో బాటు 39 మంది పెద్దల డెడ్ బాడీలివి ! వీటితో కూడిన ఈ వాహనాన్ని నడుపుతున్న 25 ఏళ్ళ ఐర్లండ్ యువకుడ్ని పోలీసులు అరెస్టు […]

భారీ ట్రక్కులో 39 మృత దేహాలు,, ఏంటా మిస్టరీ ?
Follow us

|

Updated on: Oct 23, 2019 | 4:48 PM

లండన్ దగ్గరలోని గ్రేస్ ఇండస్ట్రియల్ పార్కులో ఓ భారీ ట్రక్కు మెల్లగా ప్రయాణిస్తూ అనుమానాస్పదంగా కనబడడంతో పోలీసులు దాన్ని ఆపారు. ఈ వాహనం లోపల చూసి.. వారు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. అందులో 39 మృత దేహాలున్నాయి. బల్గేరియా నుంచి ఈ ట్రక్కు వస్తున్నట్టు భావిస్తున్నారు. ఓ టీనేజర్ తో బాటు 39 మంది పెద్దల డెడ్ బాడీలివి ! వీటితో కూడిన ఈ వాహనాన్ని నడుపుతున్న 25 ఏళ్ళ ఐర్లండ్ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మృత దేహాలకు, ఇతడికి ఏ సంబంధం ఉందా అన్న విషయమై దర్యాప్తు మొదలుపెట్టారు. బహుశా ఈ యువకుడే వీరిని హతమార్చాడా అన్న విషయం తేలలేదు. ఇంతమంది తమ ప్రాణాలు కోల్పోవడం విచారకరమని పోలీసు చీఫ్ ఏండ్రు అన్నారు. అటు బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్… ఇది చాలా షాకింగ్ ఘటన అంటూ మృతదేహాల వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. 2014 లో గ్రేస్ దగ్గరి ట్రైబరీ కంటెయినర్ పోర్టు వద్ద షిపింగ్ వాహనంలోనుంచి కొంతమంది కేకలు వినిపించడం, లోపల చూస్తే 34 మంది ఆఫ్ఘన్ సిక్కులు శ్వాస ఆడక, డీహైడ్రేషన్ తో బాధ పడుతూ కనిపించిన విషయాన్ని ఈ సందర్భంగా పోలీసులు గుర్తు చేస్తున్నారు.

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.