Nostradamus predictions 2022: నోస్ట్రాడమస్ 2022లో ఏమి జరగొచ్చని చెప్పారో తెలిస్తే అదురు పుట్టడం ఖాయం!

మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చెప్పుకున్నట్టు.. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును ముందే చెప్పిన వాడిగా మిచెల్ డి నోస్ట్రాడమ్ కు పెద్ద పేరు ఉంది. 'నోస్ట్రాడమస్'గా అందరూ పిలుచుకునే ఈయన చెప్పిన విషయాలు చాలా వరకూ జరుగుతున్నాయి.

Nostradamus predictions 2022: నోస్ట్రాడమస్ 2022లో ఏమి జరగొచ్చని చెప్పారో తెలిస్తే అదురు పుట్టడం ఖాయం!
Nostradamus Predictions

Nostradamus predictions 2022: మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చెప్పుకున్నట్టు.. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును ముందే చెప్పిన వాడిగా మిచెల్ డి నోస్ట్రాడమ్ కు పెద్ద పేరు ఉంది. ‘నోస్ట్రాడమస్’గా అందరూ పిలుచుకునే ఈయన చెప్పిన కాలజ్ఞానంలో ఉన్న విషయాలు ఉన్నట్టుగా వర్తమానంలో జరుగుతున్నాయనడానికి అనేక ఉద్నతాలు ఉన్నాయి. నోస్ట్రాడమస్ 465 సంవత్సరాల క్రితం తన పుస్తకం లెస్ ప్రొఫెటీస్‌లో వేల అంచనాలు వేసిన ఫ్రెంచ్ ప్రవక్త, జ్యోతిష్కుడు. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన దివ్యదృష్టి గల వ్యక్తిగా నోస్ట్రాడమస్ కు పేరుంది. నాలుగున్నర శతాబ్దాల క్రితమే ఈయన చెప్పిన వాటిలో చాలా వరకూ నిజమయ్యాయి.

ఆయన అంచనాలు చాలా ఖచ్చితమైనవి కాబట్టి, ప్రజలు ఇప్పటికీ అతను తన జీవితకాలంలో చెప్పిన విషయాలను నిశితంగా గమనిస్తారు. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాలపై అధ్యయనం చేస్తారు. నోస్ట్రాడమస్ డిసెంబర్ 1503లో దక్షిణ ఫ్రాన్స్‌లోని సెయింట్ రెమీ డి ప్రోవెన్స్‌లో జన్మించాడు. అతని పుస్తకం లెస్ ప్రొఫెటీస్, ఇది 942 కవితా క్వాట్రైన్‌ల సమాహారం, భవిష్యత్తులో జరిగే సంఘటనలను అంచనా వేస్తుంది. దీనిని మొదట 1555 సంవత్సరంలో ప్రచురించారు.

పుస్తకంలో వ్రాసిన విషయాల ఖచ్చితత్వాన్ని అంచనా వేయడం నోస్ట్రాడమస్ పండితులకు, నిపుణులకు కూడా ఒక గమ్మత్తైన విషయం. అయినప్పటికీ, ఆయన ప్రపంచ చరిత్రలో కొన్ని అతిపెద్ద సంఘటనలను చాలా ముందే చెప్పారు. అడాల్ఫ్ హిట్లర్ పెరుగుదల గురించి, లండన్ గ్రేట్ ఫైర్, మాజీ యూఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య, 9/11 ఉగ్రదాడులు వంటి ప్రముఖమైన ఘటనలు నోస్ట్రాడమస్ అంచనా వేసిన విధంగానే జరిగాయి.

ప్రపంచ కరువు నుంచి ఉల్కాపాతం WW3 వరకు 2021లో జరగవచ్చని నోస్ట్రాడమస్ వేసిన అంచనాలు నిజమయ్యాయి. ఇప్పుడు మనం 2022లో అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా 2022 సంవత్సరానికి నోస్ట్రాడమస్ ఏ అంచనాలు చేశారనే విషయాన్ని పరిశీలిద్దాం.

ఉల్కాపాతం

ప్రపంచం 2022లో ఉల్కల వల్ల కలిగే నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని సీజర్ అంచనా వేశారు. అతను ఆకాశంలో నిప్పుతో చేసిన ‘మెరుపుల పొడవైన కాలిబాట’ గురించి రాశాడు. దీని అర్థం ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టడం కూడా కావచ్చు.

ద్రవ్యోల్బణం

2002 గురించి ప్రవచించిన మరొక విషయం ఏమిటంటే, ద్రవ్యోల్బణం. అది ఎలా అదుపు తప్పుతుందిఅనే అంచనాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆ అంచాల ప్రకారం యూఎస్ డాలర్ విలువ పడిపోవచ్చు.

ఫ్రాన్స్‌లో సంక్షోభం

ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో వరదలు, మంటలు, కరువులకు దారితీసే గొప్ప తుఫాను కారణంగా 2022లో ఫ్రాన్స్ సంక్షోభంలో పడుతుందని మరొక అంచనా.

మానవులను నియంత్రించే కంప్యూటర్లు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ల ఆధిపత్యం మానవులపై చాలా కాలంగా అంచనా వేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నవలలు అలాగే నోస్ట్రాడుమాస్ కూడా 2022 నాటికి కృత్రిమ మేధస్సు మానవ ఇంటర్‌ఫేస్‌తో కంప్యూటర్‌ను పాలించవచ్చని అంచనా వేసింది.

ఈ అంచనాలు చాలా కాలం తరువాత నిజం కావచ్చు. లేదా చాలా ముందుగానే ఉండవచ్చు, ఏదీ అసంభవం అని చెప్పలేము.

ఇవి కూడా చదవండి: మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..

Published On - 6:36 pm, Tue, 30 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu