మళ్లీ టాటాల చేతిలోకే… ఎయిర్ ఇండియా కొనుగోలుకు టాటా సన్స్ బిడ్… 67 ఏళ్ల తర్వాత మళ్లీ….

టాటా తన పూర్వ సంస్థను సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చింది. అప్పుల్లో ఉన్న ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు బిడ్‌లో పాల్గొంది.

మళ్లీ టాటాల చేతిలోకే... ఎయిర్ ఇండియా కొనుగోలుకు టాటా సన్స్ బిడ్... 67 ఏళ్ల తర్వాత మళ్లీ....
Air India

టాటా తన పూర్వ సంస్థను సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చింది. అప్పుల్లో ఉన్న ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు 67 ఏళ్ల తర్వాత బిడ్‌లో పాల్గొంది. ఇప్పటికే ఉన్న షేర్‌తో పాటు మేజర్ షేర్‌ను దక్కించుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఇటీవల కేంద్ర విమానయాన శాఖ మంత్రి హరిదీప్ సింగ్ సైతం గతంలో ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేస్తామని, లేని పక్షంలో మూసి వేయాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఎయిర్ ఇండియాను అమ్మకానికి కేంద్రం ప్రయత్నించింది.

అప్పుల ఊబిలో ఎయిర్ ఇండియా….

ప్రభుత్వ విమాన రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దాదాపు 90 వేల కోట్ల అప్పులున్నట్లు అంచనా. దీంతో కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థితిలో కూడా లేదు. చాలా కాలంగా ఎయిర్ ఇండియాను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు తమ జీతాలు చెల్లించాలని పెట్టిన వాయిదా డిసెంబర్ 14 రావడంతో కేంద్రం ఎయిర్ ఇండియా అమ్మకపు చర్యలను  వేగ వంతం చేసింది.  కాగా, స్పైస్ జెట్ యజమాని అజయ్ సింగ్ మొదట్లో ఎయిర్ ఇండియాను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించినా… ప్రస్తుతం ఆయన ఎయిర్ ఇండియా కొనుగోలుకు సుముఖత చూపడం లేదు. ఎయిర్ మలేషియా సైతం కొనుగోలుకు విముఖత వ్యక్తం చేసింది.

స్థాపించిన సంస్థను తిరిగి…

ఎయిర్ ఇండియాను టాటా సంస్థ 1932లో టాటా ఎయిర్ లైన్స్ పేరుతో ప్రారంభించింది. జే‌ఆర్‌డీ టాటా ఈ సంస్థను స్థాపించారు. దేశంలో మొదటి ఎయిర్ లైన్స్ సంస్థ టాటా ఎయిర్‌లైన్సే. కాగా, 1946లో టాటా ఎయిర్‌లైన్స్ కాస్తా ఎయిర్ ఇండియాగా మారింది. 1963లో కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాను తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే 1977 వరకు ఆర్‌జేడీ టాటానే చైర్మన్‌గా కొనసాగారు. టాటా సన్స్ ఎయిర్ ఏషియా, విస్తారా అనే సర్వీసులను ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో భాగంగా నడుపుతున్నారు.

సర్వీసులు ఇవే…

టాటా సన్స్‌కు ఎయిర్ ఇండియాలో 13 శాతం వాటా ఉంది. ప్రస్తుతం టాటా సన్స్ ఎయిర్ విస్తారా సేవలను అందిస్తున్నారు. ఈ సంస్థ 43 విమానాలను నడిపిస్తోంది. 39 ప్రదేశాలకు విమాన సర్వీసులను నడిపిస్తోంది. 4000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక, ఎయిర్ ఏషియా ఇండియా లో 30 విమానాలు, 21 ప్రదేశాలకు విమాన సర్వీసులు, 2500 ఉద్యోగులు పని చేస్తున్నారు.