సిరియాలో వైమానిక దాడి.. 12 మంది మృతి

సిరియాలో వరుస బాంబు దాడులు.. మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా జరగుతున్న దాడుల్లో ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోగా… లక్షల మంది క్షతగాత్రులుగా మారారు. తాజాగా జరిగిన మరో వైమానిక దాడిలో.. 12 మంది సిరియా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే జనావాసాలపై బాంబులు పడటంతో పదుల సంఖ్యలో భవనలు కుప్పకూలాయి. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 7:50 am, Wed, 17 July 19