బాగ్దాదీ అండర్ వేర్ దొంగిలించి.. మట్టుబెట్టేందుకు పకడ్బందీ వ్యూహం

ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అంతమొందించేందుకు అమెరికా, కుర్దిష్ ఆధ్వర్యంలోని సిరియన్ డెమోక్రటిక్ దళాలు వేసిన పకడ్బందీ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. బాగ్దాదీ కథను సమాప్తం చేయడంలో అతడి అండర్ వేర్ కూడా ఈ దళాలకు ‘ తోడ్పడిందంటే ‘ ఆశ్ఛర్యం వేయక మానదు. ఈ భద్రతా బలగాలకు సీనియర్ అడ్వైజర్, అండర్ కవర్ ఏజెంట్ కూడా అయిన పోలాట్ కాన్ అనే వ్యక్తి.. డీఎన్ఏ ఐడెంటిఫికేషన్ కోసం బాగ్దాదీ అండర్ వేర్ ని దొంగిలించాడట. ఈ నరహంతకుడి […]

బాగ్దాదీ అండర్ వేర్ దొంగిలించి.. మట్టుబెట్టేందుకు పకడ్బందీ వ్యూహం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 29, 2019 | 6:25 PM

ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అంతమొందించేందుకు అమెరికా, కుర్దిష్ ఆధ్వర్యంలోని సిరియన్ డెమోక్రటిక్ దళాలు వేసిన పకడ్బందీ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. బాగ్దాదీ కథను సమాప్తం చేయడంలో అతడి అండర్ వేర్ కూడా ఈ దళాలకు ‘ తోడ్పడిందంటే ‘ ఆశ్ఛర్యం వేయక మానదు. ఈ భద్రతా బలగాలకు సీనియర్ అడ్వైజర్, అండర్ కవర్ ఏజెంట్ కూడా అయిన పోలాట్ కాన్ అనే వ్యక్తి.. డీఎన్ఏ ఐడెంటిఫికేషన్ కోసం బాగ్దాదీ అండర్ వేర్ ని దొంగిలించాడట. ఈ నరహంతకుడి డెన్ పై దాడికి ఇంటెలిజెన్స్ వర్గాల కృషి తాలూకు డీటైల్స్ ని ఆయన ట్వీట్ చేశాడు. బాగ్దాదీని ట్రాక్ చేసేందుకు, చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసేందుకు మే 15 నుంచే తాము సిఐఏతో కలిసి పని చేస్తూ వచ్చామని ఆయన పేర్కొన్నాడు.

బాగ్దాదీ తాను పట్టుబడకుండా తరచూ ప్రాంతాలు, నివాసాలు మారుస్తుంటాడని, ఇది తెలిసిన సీఐఏ ఏజెంట్లు అతడు ఖఛ్చితంగా ఎక్కడ దాక్కున్నాడో తెలుసుకోగలిగారని పోలాట్ వెల్లడించారు. ఈ ఐసిస్ చీఫ్ ఎలాగైనా మరణిస్తాడని ఊహించి మా ఏజెంట్లలో ఒకరు డీ ఎన్ ఏ టెస్ట్ కోసం అతని అండర్ వేర్ దొంగిలించి తెచ్చాడని అన్నారు. ఇది ఖఛ్చితంగా.. వంద శాతం బాగ్దాదీదే అన్న విషయం నిర్ధారణ అయిందన్నారు. దాడికి ముందు దీన్ని టెస్ట్ చేసినట్టు ఆయన పేర్కొన్నాడు.

చివరి నిముషం వరకూ మా ఇంటెలిజెన్స్ వర్గాలు… కో-ఆర్డినేటర్లను పంపడం, ఎయిర్ డ్రాప్ కు సంబంధించి ఆదేశాలు ఇవ్వడం, ఆపరేషన్ సక్సెస్ అయ్యేందుకు జరిపిన కృషి మంచి ఫలితాలను ఇచ్చిందని పోలాట్ తెలిపారు. ఇదిలా ఉండగా..బాగ్దాదీని అంతమొందించడంలో సిరియన్-కుర్దిష్ దళాలు ఎంతో సహకరించాయని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. వారికి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఇరాక్, సిరియా, రష్యా దేశాలను కూడా ఆయన ప్రశంసించి వాటికి ధన్యవాదాలు తెలిపారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..