Swiss: ఆత్మహత్యా పేటిక సాయంతో.. స్విట్జర్లాండ్‌లో అమెరికా మహిళ మృతి

|

Sep 26, 2024 | 8:43 AM

నొప్పి లేకుండా మనుషులను చంపేసే సూసైడ్‌ మెషిన్‌ భయపెడుతోంది. ఇంతకీ.. ఈ సూసైడ్‌ మెషిన్‌ సంగతేంటి?.. ఇప్పుడెందుకు తెరపైకి వచ్చింది?.. డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

Swiss: ఆత్మహత్యా పేటిక సాయంతో.. స్విట్జర్లాండ్‌లో అమెరికా మహిళ మృతి
Suicide Pod
Follow us on

ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు నొప్పిలేకుండా చనిపోవడానికి తయారు చేసిన ఓ మెషిన్‌ కలకలం రేపుతోంది. అదేంటి.. బతడానికి మందులు కనిపెట్టడమో.. బతకాలని చెప్పడమో చేయాలి.. కానీ.. ఆత్మహత్య చేసుకోవడానికి ఓ స్పెషల్‌ మెషిన్‌ తయారు చేయడమేంటి?.. అనుకోవచ్చు. కానీ.. ఏం చేస్తాం.. అలా ఉంది కాలం.. అంతా.. టెక్నాలజీ యుగమాయే.. ఈ కాలంలో ఏదైనా సాధ్యమే మరి.. ఇదిగో.. ఇక్కడ కనిపిస్తున్న ఈ మిషన్‌ పేరు సార్కో పాడ్‌.. అంటే.. ఆత్మహత్యా పేటిక.. ఈ మెషిన్‌ నొప్పి లేకుండా మనుషులను చంపేస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు.. ఈ మెషిన్‌లోకి వెళ్లి డోర్‌ క్లోజ్‌ చేసుకుని ఒక బటన్‌ నొక్కుతారు. అంతే.. క్షణాల్లో అందులోని నైట్రోజన్‌ గ్యాస్‌ రిలీజ్‌ అయి.. ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి. రెప్పపాటులో మనిషి శరీర కదలికలు క్లిష్టమైన స్థాయికి చేరుకుంటాయి. ఆపై కొన్ని క్షణాల్లోనే మనిషి ప్రాణాలు కోల్పోతాడు. ఒక్కమాటలో చెప్పాలంటూ మెర్సీ కిల్లింగ్‌ అన్నమాట.

ఇలా ఆత్మహత్య చేసుకునేవారు.. చేసుకోవాలి.. అనుకునేవారు.. ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి పలు దేశాల్లో అనుమతులు లేకున్నా.. స్విట్టర్జాండ్‌ మాత్రం వాటన్నింటికీ పూర్తి వ్యతిరేకం. నొప్పి లేకుండా మనుషులను చంపేసే ఈ సూసైడ్‌ మెషిన్లను స్విట్జర్లాండ్‌ చట్టబద్ధం చేసింది. శవపేటిక ఆకారంలో ఉన్న ఈ క్యాప్సూల్‌ ఒక నిమిషంలోనే నొప్పిలేకుండా, ప్రశాంతమైన మరణాన్ని ప్రసాదిస్తుంది. ఈ సూసైడ్‌ క్యాప్సూల్‌ తయారీలో డాక్టర్‌ డెత్‌గా పేరొందిన ఫిలిప్‌ నిట్‌స్కే అనే డాక్టర్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే.. తాజాగా.. అమెరికాకు చెందిన ఓ మహిళ ఈ శవపేటిక యంత్రం ద్వారా స్విట్జర్లాండ్‌లోని అటవీ ప్రాంతంలో ఓ ఇంటిలో ప్రాణాలు తీసుకోవడం చర్చనీయాంశం అయింది. కానీ.. ఆమె చనిపోయేందుకు వాడిన మెషిన్‌కు చట్టబద్దత లేకపోవడం.. కొందరు సహకరించారనే అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు స్విట్జర్లాండ్‌ పోలీసులు.

(మీరు ఆత్మహత్య ఆలోచనలతో ఇబ్బంది పడుతుంటే లేదా మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే.. కౌన్సిలింగ్ కోసం.. 9152987821 నంబర్‌ను సంప్రదించండి)

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..