Lotus Tower: చైనా రుణంతో శ్రీలంకలో భారీ నిర్మాణం.. ప్రత్యేకతలివే..

ద్వీప దేశం శ్రీలంకలో ఓ అద్భుత కట్టడం ప్రారంభానికి సిద్ధమైంది. దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభమై వివిధ కారణాలతో ఆగిన ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తైంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వచ్చిన..

Lotus Tower: చైనా రుణంతో శ్రీలంకలో భారీ నిర్మాణం.. ప్రత్యేకతలివే..
Lotus Tower Srilanka
Follow us

|

Updated on: Sep 15, 2022 | 9:00 AM

Lotus Tower: ద్వీప దేశం శ్రీలంకలో ఓ అద్భుత కట్టడం ప్రారంభానికి సిద్ధమైంది. దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభమై వివిధ కారణాలతో ఆగిన ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తైంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వచ్చిన శ్రీలంక మొత్తానికి ఓ అద్భుతమైన నిర్మాణాన్ని పూర్తిచేసుకుంది. చైనా రుణాలివ్వడంతో శ్రీలంక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన లోటస్‌ టవర్‌ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. డ్రాగన్ కంట్రీ రుణంతో నిధులు సమకూర్చుకొని దాదాపు పదేళ్ల పాటు నిర్మించిన ఈ కొలంబో లోటస్‌ టవర్‌ ఈ వారంలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1150 అడుగుల ఎత్తు కలిగిన ఈ భారీ టవర్‌ అబ్జర్వేషన్ డెక్‌ సెప్టెంబర్ 15వ తేదీ గురువారం నుంచి సందర్శకులకు తెరిచే ఉంటుందని ప్రభుత్వం ఆధ్వర్యంలోని కొలంబో లోటస్‌ టవర్‌ యాజమాన్యం సంస్థ వెల్లడించింది. ఈ భవనంలోని కార్యాలయాలు, షాపింగ్‌ స్థలాన్ని అద్దెకు ఇవ్వనున్నారు. ఈ టవర్‌ నుంచి రద్దీగా ఉండే రాజధాని కొలంబో నగరంతో పాటు హిందూ మహా సముద్రాన్ని వీక్షించవచ్చు. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈటవర్ ప్రత్యేకతలెంటో తెలుసుకుందాం.

టవర్‌ ప్రత్యేకతలు: ఈభవనం ఆకృతి తామర పువ్వు నమూనాలో డిజైన్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆసియాలో ఉన్న ఎత్తయిన టవర్లలో 11వది కాగా.. ప్రపంచంలో 19వ ఎత్తయిన టవర్‌ గా లోటస్ టవర్ నిలవనుంది.

తొలుత దీన్ని పెలియగోడ సబర్బన్‌లో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే శ్రీలంక ప్రభుత్వం ఆ లొకేషన్‌ను మార్పు చేసింది. ఈ టవర్‌ను కమ్యూనికేషన్‌, అబ్జర్వేషన్‌, ఇతర అవసరాల కోసం ఉపయోగించనున్నారు.

ఈ టవర్‌ నిర్మాణానికి అంచనా వ్యయం 113 మిలియన్‌ అమెరికా డాలర్లు.

2012లో అప్పటి అధ్యక్షుడు మహీందా రాజపక్స హయాంలో టవర్‌ నిర్మాణం మొదలుపెట్టారు. అప్పట్నుంచి అవినీతి ఆరోపణలు రావడంతో ఆటంకాలు ఏర్పడి ఎట్టకేలకు పూర్తయింది.

ఈ టవర్‌కు పర్యాటకం, యాంటెన్నా లీజింగ్‌ ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నారు. ఈ లోటస్ టవర్ రేడియో, టీవీ ప్రసార యాంటెన్నా Isdb-t, 50 టీవీ సర్వీసుల కోసం ప్రతిపాదించిన Dvb-t2 సపోర్ట్ స్ట్రక్చర్‌గా పని చేస్తుంది. అలాగే, 35 ఎంఫ్‌ఎం రేడియో స్టేషన్లు, 20 టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇది సేవలందించనుంది.

లోటస్‌ టవర్‌కు నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వీటిలో రెండు వీఐపీ ఎంట్రన్స్‌లు ఉన్నాయి.

లోటస్ టవర్ పొడియం ఆరు అంతస్తుల్లో ఉండగా.. ల్యాండ్‌ స్కేపింగ్‌ని వాటర్‌ పార్క్‌గా నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!