నా తప్పేంలేదంటూ.. శ్రీలంక రక్షణ కార్యదర్శి రాజీనామా

ఈస్టర్ ఆదివారం రోజున జరిగిన ఉగ్రదాడి ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ.. శ్రీలంక రక్షణశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తన పదవికి రాజీనామా చేశారు. పేలుళ్లకు సంబంధించిన అప్రమత్తత విషయంలో తన వైఫల్యమేమీ లేదని, అయితే తన ఆధ్వర్యంలో పనిచేస్తున్న కొన్ని సంస్థల నిర్వాకం కారణంగానే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఉగ్రదాడులపై నిఘా వర్గాలు ముందుగా హెచ్చరించినప్పటికీ.. ప్రభుత్వం దాడులను నిలువరించలేకపోయిందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ చీఫ్, రక్షణ శాఖ కార్యదర్శిని రాజీనామా చేయాలని అధ్యక్షుడు […]

నా తప్పేంలేదంటూ.. శ్రీలంక రక్షణ కార్యదర్శి రాజీనామా
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2019 | 12:01 PM

ఈస్టర్ ఆదివారం రోజున జరిగిన ఉగ్రదాడి ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ.. శ్రీలంక రక్షణశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తన పదవికి రాజీనామా చేశారు. పేలుళ్లకు సంబంధించిన అప్రమత్తత విషయంలో తన వైఫల్యమేమీ లేదని, అయితే తన ఆధ్వర్యంలో పనిచేస్తున్న కొన్ని సంస్థల నిర్వాకం కారణంగానే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.

ఉగ్రదాడులపై నిఘా వర్గాలు ముందుగా హెచ్చరించినప్పటికీ.. ప్రభుత్వం దాడులను నిలువరించలేకపోయిందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ చీఫ్, రక్షణ శాఖ కార్యదర్శిని రాజీనామా చేయాలని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదేశించారు. దీంతో హేమసిరి తన పదవికి రాజీనామా చేశారు. గత ఆదివారం శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 359 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు.