Sri Lanka Crisis: మీ కష్టాలు చూస్తుంటే కన్నీరు వస్తోంది.. గత పాలకుల వల్లే ఈ సంక్షోభం వచ్చిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీలంక ప్రధాని రాజపక్సే. అంతేకాదు.. దేశ ప్రజలను క్షమించాలని కోరుతూ ఆయన వీడియో విడుదల చేశారు. అవును.. శ్రీలంక ప్రజల కష్టాలకు కారణం తమ పాలన కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తు్న్నారు ఆ దేశ ప్రధాని రాజపక్సే. దేశంలో నిరసనలు చెలరేగిన తరువాత తొలిసారి వీడియో సందేశం విడుదల చేశారు. శ్రీలంక పరిస్థితులను చూసి చాలా బాధ పడుతున్నానని అన్నారు రాజపక్సే. పెట్రోల్ బంకుల వద్ద జనాలను చూసి కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు జన్నాన్ని రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. జనతా విముక్తి పెరముణ పార్టీ, కమ్యూనిస్టులతో కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. అధికారంలోకి రావడం కోసం జనాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీదికి తీసుకొస్తున్నారని ఆరోపించారు.
శ్రీలంక ప్రస్తుత ఆర్ధిక పరిస్థితికి తాము కారణం కాదన్నారు రాజపక్సే. గతంలో పాలించిన పార్టీలు దేశాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టాయన్నారు. అయినప్పటికీ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు. సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి ప్రయత్నిస్తున్నామని, ప్రజలు సంయమనం పాటించి ఆందోళనలు విరమించాలని కోరారు. అయితే రాజపక్సే ప్రకటనపై ఆందోళనకారులు శాంతించలేదు. రాజపక్సే సోదరులు గద్దె దిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
Also read:
Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..
విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..