Sri Lanka Crisis: ప్రధాని రాజీనామా చేశారు.. అధ్యక్షుడు పారిపోయారు.. జనం రోడ్డెక్కారు.. రణరంగంగా మారిన శ్రీలంక.. వాట్ నెక్స్ట్

ప్రధాని రాజీనామా చేశారు... అధ్యక్షుడు పారిపోయారు.. జనం రోడ్డెక్కారు... సైన్యం కూడా సరెండరవుతోంది.. ఇదీ క్లుప్తంగా కొలంబోలో తాజాగా ఇది పరిస్థితి. మరి.. లంక ద్వీపంలో మళ్లీ దీపం వెలిగించే నాధుడెవ్వడు? వాట్ నెక్స్ట్..

Sri Lanka Crisis: ప్రధాని రాజీనామా చేశారు.. అధ్యక్షుడు పారిపోయారు.. జనం రోడ్డెక్కారు.. రణరంగంగా మారిన శ్రీలంక..  వాట్ నెక్స్ట్
Sri Lanka Crisis
Sanjay Kasula

|

Jul 10, 2022 | 7:14 AM

లంకలో రావణకాష్టం(Sri Lanka Protest)రగులుతూనే ఉంది. అక్కడి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతూ క్లయిమాక్స్ దశకు చేరుకున్నాయి. ప్రధాని రాజీనామా చేశారు.. అధ్యక్షుడు పారిపోయారు.. జనం రోడ్డెక్కారు… సైన్యం కూడా సరెండరవుతోంది.. ఇదీ క్లుప్తంగా కొలంబోలో తాజాగా ఇది పరిస్థితి. మరి.. లంక ద్వీపంలో మళ్లీ దీపం వెలిగించే నాధుడెవ్వడు? వాట్ నెక్స్ట్ అంటే అక్కడ సమాధానమే కరువైంది. ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీగా మొదలైన నిరసన… క్రమంగా విధ్వంసంగా మారింది. అంతా నువ్వే చేశావ్ అంటూ కొలంబోలోని అధ్యక్షుడి అధికారిక నివాసంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు నిరసనకారులు. ‘గొటా గో హోమ్‌’ అంటూ స్లోగన్లతో హోరెత్తించారు. స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకొట్టారు. రాజపక్స బెడ్‌ రూమ్‌లోకి, కిచెన్‌లోకి దూరి నానా యాగీ చేశారు. సోఫాలపై కూర్చుని మద్యం బాటిళ్లను ఖాళీ చేశారు.

లంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య సైతం రోడ్డుపైకి వచ్చి, నిరసనకారులతో చేతులు కలిపారు. అటునుంచి ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసాన్ని టార్గెట్ చేసి.. నిలువునా తగలబెట్టేశారు ఆందోళనకారులు. అధికార పార్టీ ఎంపీలపై కూడా దాడులు మొదలయ్యాయి. ఇద్దరు మంత్రులు రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నాలుగు దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని ఈ తిరుగుబాటు మిడతల దండుని తలపించింది. లంక పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్‌లు, వాటర్ క్యానన్లు ఏమాత్రం భయపెట్టలేకపోయాయి. గాల్లోకి కాల్పులు జరిపినా ప్రయోజనం శూన్యం.

నిరసనల తాకిడి తట్టుకోలేక ఆర్మీని రంగంలోకి దించారు. కానీ.. సైన్యం సపోర్ట్ కూడా ఆందోళనకారులకే ఉన్నట్టు సంకేతాలొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ప్రధాని రణిల్‌ విక్రమసింఘే విధిలేక… అక్కడికక్కడే పదవికి రాజీనామా చేశారు. ఆవిధంగా శ్రీలంకలో అన్ని పార్టీలతో కూడిన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసినట్టు పీఎంఓ ప్రకటించింది.

అటు… లంక అధ్యక్షుడి ఆచూకీ ఇంతవరకూ తెలీలేదు. దశాబ్దాల పాటు కొనసాగిన తమిళ పులుల పోరాటాన్ని పాశవికంగా అణగదొక్కి… ఆ విజయగర్వంతోనే అధ్యక్ష పీఠాన్నెక్కిన రాజపక్స… ఇప్పుడు తన ప్రజల నుంచే తనను కాపాడుకోలేని దురవస్థలో పడ్డారు. భయంతో కలుగులో దాక్కున్నారు. మళ్లీ కనిపిస్తే జనమే కొట్టి చంపుతారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో… షిప్ ఎక్కి పారిపోయారు. మిలిటరీ వాహనమెక్కి రహస్య స్థావరం చేరుకున్న అధ్యక్షులవారు అసలెక్కడ దాక్కున్నారన్నది అంతుబట్టకుండా ఉంది. మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే కూడా జనానికి జడుసుకుని దేశం వదిలి పారిపోయే ఛాన్సుంది.

అంతర్జాతీయ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu