ముఖం కప్పుకుంటే ఫినిష్.. శ్రీలంకలో న్యూ ఆర్డర్స్

ఉగ్రదాడుల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరూ ముఖాలు కప్పుకోరాదని ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ కాగా.. సోమవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వాటిల్లో తెలిపారు. ముఖానికి ముసుగు ధరించడం ద్వారా తమ ఐడెంటిటీని దాచడానికి ప్రయత్నించకూడదని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. కాగా అత్యవసర నిబంధనల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన సిరిసేన.. […]

ముఖం కప్పుకుంటే ఫినిష్.. శ్రీలంకలో న్యూ ఆర్డర్స్
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2019 | 12:15 PM

ఉగ్రదాడుల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరూ ముఖాలు కప్పుకోరాదని ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ కాగా.. సోమవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వాటిల్లో తెలిపారు. ముఖానికి ముసుగు ధరించడం ద్వారా తమ ఐడెంటిటీని దాచడానికి ప్రయత్నించకూడదని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. కాగా అత్యవసర నిబంధనల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన సిరిసేన.. ప్రజా రక్షణ కోసమే దీనిని అమలు చేస్తున్నామని అన్నారు. తాజాగా జరిగిన పేలుళ్లలో ఆరుగురు పిల్లలతో సహా 15మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అదే సమయంలో భద్రతాదళాల కాల్పుల్లో తండ్రి, కొడుకులతో సహా ముగ్గురు సూసైడ్ బాంబర్లు ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఈస్టర్ పర్వదినాన శ్రీలంలో జరిగిన వరుస పేలుళ్ల ప్రభావం ఈ ఆదివారం కూడా కనిపించింది. ప్రార్థనల కోసం చర్చ్‌లకు వెళ్లేందుకు జనాలు భయపడటంతో.. ప్రార్థనాస్థలాలు బోసిగా కనిపించాయి. మరోవైపు ఉగ్రవాదుల కోసం ఆ దేశ ఆర్మీ బలగాలు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా అహ్మద్ అనే అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు.. అతడి నుంచి ఉగ్ర సాహిత్యం, జర్మన్ తయారీ ఎయిర్‌గన్, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!