Snowball Fight In Spain : మాడ్రిడ్లో మంచు తుఫాన్, ఓ వైపు ప్రభుత్వం రెడ్ ఎలర్ట్. మరోవైపు యువత మంచుతో కొట్లాట

నిన్నా మొన్నటి వరకూ కరోనా వైరస్ భయంతో గడిపిన ప్రజలు.. తమ ప్రాంతంలో కురుస్తున్న మంచు ని చూసి ఆ బాధను భయాన్ని మరచిపోయారు. భారీగా కురుస్తున్న హిమపాతంతో శ్వేతవర్ణాన్ని అద్దుకున్న తమ నగరాన్ని చూసి సంతోషంతో ఉప్పొంగిపోయారు..

Snowball Fight In Spain : మాడ్రిడ్లో మంచు తుఫాన్, ఓ వైపు ప్రభుత్వం రెడ్ ఎలర్ట్. మరోవైపు యువత మంచుతో కొట్లాట
Follow us

|

Updated on: Jan 12, 2021 | 11:43 AM

Snowball Fight In Spain : నిన్నా మొన్నటి వరకూ కరోనా వైరస్ భయంతో గడిపిన ప్రజలు.. తమ ప్రాంతంలో కురుస్తున్న మంచు ని చూసి ఆ బాధను భయాన్ని మరచిపోయారు. భారీగా కురుస్తున్న హిమపాతంతో శ్వేతవర్ణాన్ని అద్దుకున్న తమ నగరాన్ని చూసి సంతోషంతో ఉప్పొంగిపోయారు స్థానికులు. దీంతో ఒక్క సారిగా మంచు నిండిన రదారులపై వందల మంది చేరుకొని యుద్ధం చేసుకున్నారు. చేతిలో మంచు ముద్దలను పట్టుకొని అవతలి గుంపుపైకి కసిగా విసిరారు. అరుపులు, ఉత్సాహంతో దాడి చేసుకున్నారు. ఆనందడోలికల్లో తేలియాడారు. ఈ మంచు సమరం స్పెయిన్​లోని మ్యాడ్రిడ్​ లో జరిగింది. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్​ తో పాటు పలు ప్రాంతాల్లో మంచు తన విశ్వరూపం చూపిస్తుంది. ఫిలోమేనా అనే మంచు తుఫాను పలు ప్రాంతాల్లో కురుస్తుంది. దీంతో దశాబ్దాల తర్వాత అత్యంత ఎక్కువ మొత్తంలో మంచుతో చాలా ప్రాంతాలు కప్పుకుపోయాయి.

ఆనందాన్ని పంచుతున్న వాతావరణాన్ని చూసిన యువత నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ల పైకి వచ్చి రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు మంచు ముద్దలు విసురుకున్నారు. ఎంజాయ్ చేశారు.  మరోవైపు ప్రభుత్వం మంచుని క్లియర్ చేయడానికి రెస్క్యూ టీమ్ ని రంగంలోకి దింపింది. తుఫాను ధాటికి ఆ దేశంలో వేలాది మంది ఎక్కడివారు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. ఎయిర్​పోర్టుల్లోనే చాలా మంది నిలిచిపోయారు. రోడ్లమీద, రైల్వే ట్రాక్స్ పై మంచు పేరుకు పోవడంతో.. కార్లు, రైళ్లు నడవలేని పరిస్థితి ఏర్పడింది. 1980 తర్వాత అత్యంత భారీ తుఫానుతో మ్యాడ్రిడ్ ఇబ్బందులు పడుతోంది. దీంతో సిటీ మెయిన్ పార్క్ మూసివేయడం సహా సబర్బన్​ హైవేలను మూసేశారు. కొన్ని తీవ్రమైన ఆంక్షలు విధించారు. అధికారులు సైతం రెడ్ అలెర్ట్ ప్రకటించారు. సహాయక చర్యల కోసం సైన్యం సైతం రంగంలోకి దిగింది.

Also Read: చైనా బంగారు గని లో భారీ పేలుడు.. చిక్కుకున్న 22 మంది కార్మికులు… సహక చర్యలకు ఆటంకం