Shocking: విమానాశ్రయంలో తేడాగా సీల్డ్ కవర్.. ఓపెన్ చేసిన అధికారులు హడలిపోయారు.. అంతలా ఏముందంటే..

సాధారణంగానే కొరియర్ సర్వీస్ ద్వారా వస్తువుల రవాణా చేస్తారు. ఒక పట్టణం నుంచి మరో పట్టణం.. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం.. ఒక దేశం నుంచి మరో దేశానికి కొరియర్ సర్వీస్ నడుస్తోంది.

Shocking: విమానాశ్రయంలో తేడాగా సీల్డ్ కవర్.. ఓపెన్ చేసిన అధికారులు హడలిపోయారు.. అంతలా ఏముందంటే..
Skeleton
Follow us

|

Updated on: Dec 31, 2022 | 10:08 PM

సాధారణంగానే కొరియర్ సర్వీస్ ద్వారా వస్తువుల రవాణా చేస్తారు. ఒక పట్టణం నుంచి మరో పట్టణం.. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం.. ఒక దేశం నుంచి మరో దేశానికి కొరియర్ సర్వీస్ నడుస్తోంది. అయితే, తాజాగా కొరియర్.. అధికారులను హడలెత్తించింది. బాబోయ్ అంటూ అంతదూరం పరుగులు తీసిన పరిస్థితి వచ్చింది. మెక్సికో విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సెంట్రల్ మెక్సికోలోని క్వెరెటారో ఇంటర్‌కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో కార్డ్‌బోర్డ్ పెట్టెలో అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసిన పుర్రెలు కనిపించాయి. అమెరికాకు కొరియర్ ద్వారా పంపిన ఈ కార్డ్‌బోర్డ్‌లో పుర్రెలను అధికారులు గుర్తించారు. మెక్సికో లోని అత్యంత హింసాత్మక ప్రాంతాలలో ఒకటైన పశ్చిమ తీర రాష్ట్రమైన మిచోకాన్ నుంచి ప్యాకేజీ వచ్చిందని, దీనిని దక్షిణ కరోలినాలోని మన్నింగ్‌కు కొరియర్ చేశారని అధికారులు గుర్తించారు. ఈ పుర్రెలకు సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు.

ఈ పుర్రెల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మెక్సికో అధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ పుర్రెలు ఎవరికి సంబంధించినవి? ఎవరు పంపారు? ఎక్కిడిక పంపారు? ఎందుకు పంపారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..