Diagnose Test: వైద్యశాస్త్రంలో మరో మైలురాయి.. సూది లేకుండానే రోగ నిర్ధారణ పరీక్ష..

సాధారణంగా మనం అనారోగ్యానికి గురైనప్పుడో లేక బాడీ చెకప్ కోసం ఆస్పత్రికి గానీ, డయాగ్నస్టిక్ సెంటర్లకు గానీ వెళ్తుంటాం. అక్కడ ఉండే సిబ్బంది ఎక్కువ రక్త పరీక్ష చేయడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే రక్తంలో...

Diagnose Test: వైద్యశాస్త్రంలో మరో మైలురాయి.. సూది లేకుండానే రోగ నిర్ధారణ పరీక్ష..
Diagnostic
Follow us

|

Updated on: Nov 20, 2022 | 11:16 AM

సాధారణంగా మనం అనారోగ్యానికి గురైనప్పుడో లేక బాడీ చెకప్ కోసం ఆస్పత్రికి గానీ, డయాగ్నస్టిక్ సెంటర్లకు గానీ వెళ్తుంటాం. అక్కడ ఉండే సిబ్బంది ఎక్కువ రక్త పరీక్ష చేయడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే రక్తంలో ప్రతిజనకాలు, ప్రతిరక్షకాలు, విష పదార్థాలు, సూక్ష్మ జీవులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే.. రక్తపరీక్ష చేయాలంటే శరీరంలోకి సూదిని గుచ్చి రక్తం తీయాల్సి ఉంటుంది. రక్తాన్ని సేకరించడానికి సుశిక్షితులైన ఆరోగ్యపరిరక్షణ సిబ్బంది సైతం అవసరం. ఈ ఇబ్బందులను దూరం చేసేందుకు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాల సైంటిస్టులు ఓ కొత్త విధానాన్ని కనుగొన్నారు. వ్యక్తి స్పర్శతో రక్తాన్ని పరీక్షించే విధానాన్ని గుర్తించారు. హైడ్రోజెల్‌ పూత కలిగిన రసాయన బయోసెన్సర్‌ను వారు డెవలప్ చేశారు. ఈ పరికరానికి ఉండే బటన్ ను ఒకసారి తాకితే చాలు… రోగి చర్మం ద్వారా విడుదలయ్యే చెమటలోని అణువులను సేకరిస్తుంది. అంతే కాకుండా ఆ స్వేదాన్ని విశ్లేషిస్తుంది. హార్మోన్లు, పోషకాలు, మందులు, మెటబోలైట్లను గుర్తిస్తుంది. ఇది గుండె స్పందన రేటు, రక్తంలో ఆక్సిజన్‌ లెవెల్స్ ను తెలుపుతుంది.

ఈ విధానం ద్వారా చేసే పరీక్షల తాలూకూ వ్యక్తిగత ఆరోగ్య వివరాలు బయటకు రాకుండా అత్యంత రహస్యంగా ఉండేలా చేస్తుంది. పరీక్ష ఫలితాలనూ ఎన్‌క్రిప్ట్‌ చేస్తుంది. వ్యక్తి వేలిముద్ర ద్వారానే దాన్ని అన్‌లాక్‌ చేయడం సాధ్యమవుతుంది. ఔషధాల స్థాయి, రక్తంలో చక్కెర పరిమాణం వంటివీ తెలుసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.