ఇంకా విషమంగా రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ ఆరోగ్యం ఇంకా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయనపై జరిగిన విష ప్రయోగంపై దర్యాప్తుకు ఆదేశించింది రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నావల్నీ ప్రస్తుతం బెర్లిన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జర్మనీకి చెందిన ప్రత్యేక వైద్యం బందం ఆయనకు చికిత్స అందిస్తోంది.

ఇంకా విషమంగా రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ
Balu

|

Aug 30, 2020 | 3:51 PM

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ ఆరోగ్యం ఇంకా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయనపై జరిగిన విష ప్రయోగంపై దర్యాప్తుకు ఆదేశించింది రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నావల్నీ ప్రస్తుతం బెర్లిన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జర్మనీకి చెందిన ప్రత్యేక వైద్యం బందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఇప్పటికీ ఆయన కోమాలోనే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అయితే అతని పరిస్థితి స్థిరంగా ఉందని, అతని లక్షణాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు.

గత వారం క్రితం సైబీరియా నుండి మాస్కోకు తిరిగి వెళ్లే విమానంలో అనారోగ్యానికి గురయ్యాడు. విమానం అత్యవసర పరిస్థితుల్లో సైబీరియన్ నగరమైన ఓమ్స్క్ లోని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. నవాల్నీ టాంస్క్‌లో బస చేసిన హోటల్ గదిని, నగరంలో ఆయన పర్యటించిన ప్రాంతాలను పరిశీలించిన ప్రాంతాల వీడియో ఫుటేజీలను విశ్లేషించినట్లు సైబీరియన్ సైబీరియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇప్పటి వరకు నావల్నీపై ప్రయోగించిన మందుకు సంబంధించి ఎలాంటి వివరాలను కనుగొనలేదని పేర్కొంది. అటు యూరోపియన్ యూనియన్ మంత్రులు ఈ వారం నావల్నీ పరిస్థితిపై సమావేశమై చర్చించనున్నారు. అతనికి సరయై వైద్యం అందించేలా రష్యా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu