రూ. 4లక్షల మద్యం బాటిల్ మిస్.. ఆచూకీ కనుగొనే పనిలో లీనమైన అమెరికా..!

విదేశీ పర్యటనల్లో ఆయా దేశాలకు వెళ్లిన మంత్రులు, ఉన్నతాధికారులకు అక్కడి అధికారులు గుర్తుగా కొన్ని బహుమతులు అందిస్తుంటారు. అయితే ట్రంప్‌ హయాంలో అమెరికా విదేశాంగమంత్రిగా ఉన్న మైక్‌ పాంపియోకు జపాన్‌ అధికారులు ఓ ఖరీదైన మద్యం బాటిల్‌ను గిఫ్ట్‌గా అందించారు.

రూ. 4లక్షల మద్యం బాటిల్ మిస్.. ఆచూకీ కనుగొనే పనిలో లీనమైన అమెరికా..!
Pompeo

విదేశీ పర్యటనల్లో ఆయా దేశాలకు వెళ్లిన మంత్రులు, ఉన్నతాధికారులకు అక్కడి అధికారులు గుర్తుగా కొన్ని బహుమతులు అందిస్తుంటారు. అయితే ట్రంప్‌ హయాంలో అమెరికా విదేశాంగమంత్రిగా ఉన్న మైక్‌ పాంపియోకు జపాన్‌ అధికారులు ఓ ఖరీదైన మద్యం బాటిల్‌ను గిఫ్ట్‌గా అందించారు. అయితే తాజాగా ఆ మద్యం బాటిల్‌ కనిపించకపోవడంతో తీవ్ర దుమారం రేగుతోంది. ఏకంగా ఆ మద్యం బాటిల్‌ ఆచూకి కనుగొనాలంటూ అమెరికా ప్రభుత్వం ఆదేశించించడంతో అసలు విషయం బయటకు పొక్కింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పనిచేసిన సమయంలో విదేశీ పర్యటనలో భాగంగా మైక్‌ పాంపియో 2019, జూన్‌ 24న జపాన్‌ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనకు గుర్తుగా జపాన్ అధికారులు పాంపియోకు 5800 డాలర్ల(సుమారు రూ.4 లక్షలు) విలువచేసే ఓ మద్యం బాటిల్‌ ను గిఫ్ట్‌గా అందించారు.

కాగా, మైక్‌ పాంపియో ఆ సమయంలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. మైక్‌ పాంపియో ఆ మద్యం బాటిల్‌ను స్వయంగా తీసుకున్నారా? లేదా అనే విషయంపై వివరణ ఇవ్వలేదు. ఆ మద్యం బాటిల్‌ కనిపించక పోవడంతో తీవ్ర చర్చకు దారితీసింది. అమెకిరా ప్రభుత్వ అధికారులు 390 డాలర్ల(సుమారు రూ. 28 వేలు) కంటే తక్కువ విలువ కలిగిన బహుమతులు తీసుకునేందుకు అనుమతి ఉంది. ఈ విలువ కంటే ఎక్కువగా ఉంటే వాటి ఆ ధరను చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ట్రంప హయాంలో అమెరికా ప్రభుత్వం మాత్రం ఆ మద్యం బాటిల్‌కు ఎలాంటి చెల్లింపులు చేసినట్లు ఆధారాలు లేవు. దీంతో ప్రస్తుతం మద్యం సీసా కూడా కనిపించకుండా పోయింది.

ఆ మద్యం బాటిల్ కోసం అమెరికా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై స్పందించిన మైక్‌ పాంపియో లాయర్, ఆ మద్యం బాటిల్ ఎక్కడుందో తెలియదని, ఆ మద్యం బాటిల్‌ను స్వీకరించినట్లు కూడా గుర్తు లేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే, బహుమతిని వెల్లడించడంలో ఉద్దేశపూర్వకంగా విఫలమైతే 50,000 పెనాల్టీ లేదా తప్పుడు సమాచారం అందించినందుకు జైలు శిక్షకూడా పడే అవకాశం ఉందిని నిపుణులు అంటున్నారు.

Also Read: Viral Video: నువ్వు ఎలుగుబంటివైతే నాకేంటి..? ఆ పిల్లి ధైర్యం చూడాల్సిందే..!

ఆఫ్ఘనిస్తాన్ పై చర్చకు మూడు దేశాలకు రష్యా ఆహ్వానం.. ఇండియాకు మొండిచెయ్యి

Click on your DTH Provider to Add TV9 Telugu