South Korea Floods: దక్షిణ కొరియాలో కుండపోత వానలు.. జల దిగ్బంధంలో సియోల్‌..

South Korea Floods: దక్షిణ కొరియాను వర్షాలు కుదిపేస్తున్నాయి. రాజధాని సియోల్‌ నగరం నీటిలో మునిగిపోయింది. భారీ వర్షాలు, వరదలకు రోడ్లు మునిగిపోయాయి.

South Korea Floods: దక్షిణ కొరియాలో కుండపోత వానలు.. జల దిగ్బంధంలో సియోల్‌..
South Korea
Follow us

|

Updated on: Aug 09, 2022 | 9:18 AM

South Korea Floods: దక్షిణ కొరియాను వర్షాలు కుదిపేస్తున్నాయి. రాజధాని సియోల్‌ నగరం నీటిలో మునిగిపోయింది. భారీ వర్షాలు, వరదలకు రోడ్లు మునిగిపోయాయి. కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీటితో రోడ్లు, అండర్‌పాస్‌లను కూడా మూసివేశారు. సియోల్‌లో 90.5 మిమీ వర్షం కురిసింది. అటు దక్షిణ సియోల్‌లోని డోంగ్‌జాక్ జిల్లాలో గంటకు 137 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దశాబ్దాలలో అత్యంత దారుణమైన వర్షపాతం అని వాతావరణశాఖ తెలిపింది. అయితే రుతుపవనాల వర్షాలు విధ్వంసం సృష్టించాయి. సియోల్‌లోని సియోచో స్టేషన్ బయటే బస్సులు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఇటు సియోల్‌ రోడ్లులన్నీ నీళ్లతో నిండిపోవడంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. మోకాళ్ల లోతు నీరు ఉండడంతో వాహనాలు ముందుకు వెళ్లడానికి ఇబ్బంది ఎదుర్వుతోంది. అటు గంగ్నామ్ ప్రాంతంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.

సెంట్రల్ గంగ్నం, సియోల్‌లో వీధులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇళ్లు నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు పొటెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. అర్థరాత్రి కురిసిన భారీ వర్షానికి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ దాదాపుగా అతలాకుతలం అయింది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అడవులకు సమీపంలో నివసించే వారు కూడా ముందుజాగ్రత్తగా ఖాళీ చేయాలని సూచించింది. మరోవైపు వర్షాలకు దెబ్బతిన్న నగరాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా‌లో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..