Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమ సింఘే ఎన్నిక.. సీక్రెట్ బ్యాలెట్‌లో గెలుపు..

Sri Lanka New President: కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్లమెంట్‌లో సీక్రెట్‌ బ్యాలెట్‌ ఎన్నిక నిర్వహించారు. విక్రమసింఘేకు 134 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్ధి దుల్లాస్‌ అల్హపెరమాకు 82 ఓట్లు వచ్చాయి.

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమ సింఘే ఎన్నిక.. సీక్రెట్ బ్యాలెట్‌లో గెలుపు..
Sri Lanka President Ranil Wickremesinghe (File Photo)
Follow us

|

Updated on: Jul 20, 2022 | 1:14 PM

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే ఎన్నికయ్యారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్లమెంట్‌లో సీక్రెట్‌ బ్యాలెట్‌ ఎన్నిక నిర్వహించారు. విక్రమసింఘేకు 134 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్ధి దుల్లాస్‌ అల్హపెరమాకు 82 ఓట్లు వచ్చాయి. అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డ మూడో అభ్యర్ధి డిసనాయకేకు కేవలం కేవలం 3 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 223 ఓట్లు పోలయ్యాయి. అయితే రణిల్‌ విక్రమసింఘే దేశ అధ్యక్షుడు అయితే దేశానికి ఎలాంటి లాభం లేదంటున్నారు ఆందోళనకారులు. విక్రమసింఘే మాజీ అధ్యక్షుడు గొటబాయ ఏజెంట్‌ అని ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య సీక్రెట్‌ డీలింగ్‌ వల్లే ఒక్క ఎంపీ మద్దతు కూడా లేని రణిల్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని విమర్శిస్తున్నారు. రణిల్‌ విక్రమసింగే శ్రీలంక 8వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతారు. ప్రస్తుతం ఆయన దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు.

శ్రీలంకలో 30 ఏళ్లలో తొలిసారి ఎంపీలు దేశ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. తన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని , వాటిని అందరి సహకరంతో అధిగమిస్తానని దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ప్రకటించారు రణిల్‌ విక్రమసింఘే.

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే..

ఇవి కూడా చదవండి

73 ఏళ్ల రణిల్‌ విక్రమ సింఘే శ్రీలంక పార్లమెంటులో సుదీర్ఘ కాలం సభ్యుడిగా వున్నారు. గత 45ఏళ్లుగా పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వివిధ దేశాలతో మంచి సంబంధాలు ఉండటం వల్ల అంతర్జాతీయ వ్యవహారాల్లో సింఘే సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. విక్రమ సింఘే స్వయంగా న్యాయవాది.. |

1977లో రణిల్‌ విక్రమ సింఘే తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లంక రాజకీయాల్లోనే అత్యంత ప్రభావవంతమైన నేతగా ఉన్నారు. 1993లో తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన రణిల్‌.. వివిధ ప్రభుత్వాల్లో దాదాపు అన్ని మంత్రిత్వశాఖలూ నిర్వహించారు. మొత్తం నాలుగు దఫాలుగా ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. 2020లో అంతర్గత సంక్షోభంతో పార్టీలో చీలిక రావడంతో రణిల్‌ పార్టీ రెండుగా విడిపోయింది. ఆ తరువాత యూఎన్‌పీ అధినేతగా రణిల్‌ కొనసాగుతున్నారు.

2018లో అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో వచ్చిన విబేధాలు విక్రమ సింఘే ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేశాయి. 2019లో ఈస్టర్‌ పండగ రోజున జరిగిన దాడిలో 260మంది ప్రాణాలు కోల్పోవడంతో రణిల్‌ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఆ తరువాత 2020లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విక్రమ సింఘే పార్టీ ఘోరంగా దెబ్బతింది. ఒక్కస్థానం కూడా దక్కలేదు.

అంతర్జాతీయ వార్తల కోసం..