నాటో సమ్మిట్‌లో నవ్వుల పువ్వులు..ట్రంప్‌పై కామెడీ పంచ్‌లు

లండన్‌లో జరుగుతున్న నాటో సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాటో నాయకులకు క్వీన్‌ ఎలిజబెత్‌ 2 బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో విందు ఏర్పాటుచేశారు. ఈ విందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌ సహా 29 దేశాధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవ్వుల పువ్వులు పూయించారు నేతలు. సతీమణితో కలిసి వచ్చిన ట్రంప్‌ను ఆత్మీయంగా ఆహ్వానించారు క్వీన్‌ ఎలిజబెత్, ఆమె కుమారుడు ప్రిన్స్‌ ఛార్లెస్ అండ్‌ కెమిల్లా. […]

నాటో సమ్మిట్‌లో నవ్వుల పువ్వులు..ట్రంప్‌పై కామెడీ పంచ్‌లు
Follow us

|

Updated on: Dec 04, 2019 | 7:24 PM

లండన్‌లో జరుగుతున్న నాటో సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాటో నాయకులకు క్వీన్‌ ఎలిజబెత్‌ 2 బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో విందు ఏర్పాటుచేశారు. ఈ విందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌ సహా 29 దేశాధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవ్వుల పువ్వులు పూయించారు నేతలు.

సతీమణితో కలిసి వచ్చిన ట్రంప్‌ను ఆత్మీయంగా ఆహ్వానించారు క్వీన్‌ ఎలిజబెత్, ఆమె కుమారుడు ప్రిన్స్‌ ఛార్లెస్ అండ్‌ కెమిల్లా. ఐతే బ్రిటన్ యువరాణి అన్నే అలా చూస్తూ ఉండిపోవడంతో వారిని పలకరించమని కూతురికి సైగ చేస్తారు క్వీన్ ఎలిజబెత్. దీంతో అన్నేఇబ్బందిగా ఫీలవుతారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు బోరిస్‌ జాన్సన్‌, జస్టిన్‌ ట్రూడో, ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ల మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై సరదా సంభాషణ సాగింది. మీడియాతో మాట్లాడుతుండటంతో ఆయన రావడం ఆలస్యమైందంటూ జోకులు వేసుకున్నారు. ఈ వీడియో కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.