Pakistan Economic Crisis: ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్తాన్‌.. గట్టెక్కేందుకు పొదుపు చర్యలు.. మార్కెట్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌ క్లోజ్..

పొరుగు దేశం పాకిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతున్నాయ్‌. ఎంతలా అంటే ...ఏం చేసినా ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కలేనంతగా. ఇక, ఇప్పుడు అంధకారాన్ని తప్పించుకునేందుకు రాత్రి ఎనిమిదిన్నరకే పవర్‌ ఆఫ్‌ చేస్తోంది పాక్. అంతేకాదు ఆకలితో అక్కడి జనం..

Pakistan Economic Crisis: ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్తాన్‌.. గట్టెక్కేందుకు పొదుపు చర్యలు.. మార్కెట్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌ క్లోజ్..
Pakistan Economic Crisis
Follow us

|

Updated on: Jan 05, 2023 | 7:52 AM

పాకిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. రోజురోజుకీ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. నిత్యావసర వస్తువులకు కూడా కటకటలాడాల్సిన పరిస్థితి. తాజాగా విద్యుత్‌ సంక్షోభం చుట్టుముట్టింది. కరెంట్‌ కొరతతో చాలా ప్రాంతాలు అధకారంలోకి వెళ్లిపోయాయి. దీంతో విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. పరిస్థితులు నానాటికీ దిగజారిపోతుండటంతో పొదుపు మంత్రం పాటిస్తోంది పాకిస్తాన్ సర్కార్‌. మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్స్‌, ఫంక్షన్‌హాల్స్‌పై ఆంక్షలు విధించింది. వాటిని రాత్రి ఎనిమిదిన్నరకల్లా మూసేయాలని ఆదేశించింది. అలాగైనా విద్యుత్‌ సంక్షోభం నుంచి గట్టెక్కొచ్చని భావిస్తోంది పాకిస్తాన్‌.

విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా డీజిల్‌ విద్యుత్‌ జనరేటర్స్‌ను వాడటం వల్ల డీజిల్‌ దిగుమతులు ఎక్కువై భారం పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. పాకిస్తాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో విద్యుత్‌, ఇంధన పొదుపు చర్యల మీద తీసుకోవాల్సిన విధి విధానాల మీద చేసిన తీర్మానాన్ని కేబినెట్‌ ఆమోదించింది. ఆ తీర్మానం వెంటనే అమలులోకొస్తుందని ప్రకటించారు పాక్‌ రక్షణమంత్రి ఆసిఫ్‌.

మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లను రాత్రి ఎనిమిదిన్నరకల్లా మూసేయాలని ఆదేశించింది. చివరికి పెండ్లి మండపాలపై ఆంక్షలు విధించింది. రాత్రి పదిగంటలకల్లా మ్యారేజ్‌ ఫంక్షన్‌ హాల్స్‌ను మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, మ్యారేజ్‌ ఫంక్షన్‌ హాల్స్‌ను త్వరగా క్లోజ్‌ చేయడం ద్వారా విద్యుత్‌ సంక్షోభం నుంచి గట్టెక్కొచ్చని భావిస్తోంది పాకిస్తాన్‌.

ఆర్ధికరంగం కుదేలవడం, నిరుద్యోగంలాంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతోంది పాకిస్తాన్‌. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతున్నాయ్‌. నిత్యవసర వస్తువులకు కూడా కటకటలాడాల్సిన పరిస్థితి ఉందక్కడ. ఉద్యోగుల జీతాల్లో కూడా కోతలు పెట్టింది.

ఇక గ్రామీణ పాకిస్తాన్‌ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఎవరైన అన్నదానం చేస్తున్నారంటే గ్రామీణ జనం పరుగులు పెడుతున్నారు. కుప్పలు కుప్పలుగా జనం పరుగెత్తుకురావడంతో సాయం చేసేందుకు వచ్చినవారు కూడా వెనక్కి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..