ఇంగ్లండ్‌లో కత్తిపోట్ల ఘటన: నిందితుడు అరెస్ట్

ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ సిటీ సెంటర్‌లో కత్తిపోట్లు కలకలం రేపిన విషయం తెలిసిందే.‌ ఈ ఘటనకు కారణమైన

  • Tv9 Telugu
  • Publish Date - 5:39 pm, Mon, 7 September 20
ఇంగ్లండ్‌లో కత్తిపోట్ల ఘటన: నిందితుడు అరెస్ట్

Birmingham stabbings case: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ సిటీ సెంటర్‌లో కత్తిపోట్లు కలకలం రేపిన విషయం తెలిసిందే.‌ ఈ ఘటనకు కారణమైన నిందితుడిని(27 సంవత్సరాలు) వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి, పలు కేసులను నమోదు చేశారు. అయితే ఏ ఉద్దేశ్యంతో అతడు ఈ దాడులకు పాల్పడ్డాడన్న దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నరహత్యగా ఈ ఘటనను పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఇంకా ప్రత్యక్ష సాక్ష్యులను విచారించలేదని, వారి నుంచి సమాచారం సేకరిస్తామని పోలీసులు చెబుతున్నారు. అయితే బర్మింగ్‌హామ్‌ సిటీ సెంటర్‌ ప్రాంతంలో ఆదివారం స్థానికులపై ఓ వ్యక్తి వరుసగా కత్తిపోట్లకు పాల్పడ్డారు. దాదాపు అరగంట వ్యవధిలో పలువురిపై అతడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Read More:

‘అల’ వచ్చిన పేరు ‘వి’లా పోయింది

‘మెగాస్టార్’‌కి చిరంజీవి విషెస్‌