వార్‌కు రెడీ.. పాక్ క్షిపణి ప్రయోగం

భారత్‌తో తలపడేందుకు పాకిస్తాన్ ఉవ్విళ్లూరుతోంది. జమ్ముకశ్మీర్‌ విషయంలో భారత్‌ను అంతర్జాతీయ దోషిగా నిలబెట్టాలని చూసిన పాక్‌కు అన్ని వైపుల నుంచి నిరాశ ఎదురవ్వడంతో ఇప్పుడు యుద్ధం చేయాలని కసరత్తులు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించారు ఆ దేశ అధికారులు. ఈ విషయాన్ని పాక్ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘‘గజ్నవి మిస్సైల్‌ను పాకిస్తాన్ విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిస్సైల్ 290కి.మీల వరకు వివిధ వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. ఈ విజయంపై […]

వార్‌కు రెడీ.. పాక్ క్షిపణి ప్రయోగం
Follow us

| Edited By:

Updated on: Aug 29, 2019 | 1:16 PM

భారత్‌తో తలపడేందుకు పాకిస్తాన్ ఉవ్విళ్లూరుతోంది. జమ్ముకశ్మీర్‌ విషయంలో భారత్‌ను అంతర్జాతీయ దోషిగా నిలబెట్టాలని చూసిన పాక్‌కు అన్ని వైపుల నుంచి నిరాశ ఎదురవ్వడంతో ఇప్పుడు యుద్ధం చేయాలని కసరత్తులు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించారు ఆ దేశ అధికారులు. ఈ విషయాన్ని పాక్ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘‘గజ్నవి మిస్సైల్‌ను పాకిస్తాన్ విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిస్సైల్ 290కి.మీల వరకు వివిధ వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. ఈ విజయంపై ప్రధాని, అధ్యక్షుడు అభినందనలు తెలిపారు’’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా గజ్నవి అన్నది స్వల్ప దూర క్షిపణి. కాగా ఈ పరీక్షను నిర్వహించేందుకు కరాచీ గగనతలంలోని మూడు రూట్‌‌లను ఆగష్టు 28 నుంచి 31వరకు మూసివేసింది పాక్ ప్రభుత్వం.

ఇదిలా ఉంటే మరోవైపు యుద్ధంపై ఇప్పటికే పాక్‌ ప్రభుత్వానికి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ముందుగా అణ్వాయుధాలు ప్రయోగించే విషయంలో భారత్ ఎప్పుడూ ముందు ఉండదని.. కానీ భవిష్యత్‌లో పరిస్థితులను బట్టి భారత్ తీరు మారొచ్చంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు పాకిస్థాన్ వికృత చేష్టలను అడ్డుకునేందుకు భారత త్రివిధ దళాలు కూడా తమ తమ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.