Pakistan: ఇమ్రాన్ ఖాన్ తప్పించిన వ్యక్తికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బాధ్యతలు.. కీలక నిర్ణయం వెనుక కథ ఇదే..

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎంపికలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పక్కనబెట్టిన వ్యక్తికి ఇప్పటి ప్రధాని పట్టం కట్టబోతున్నారు.

Pakistan: ఇమ్రాన్ ఖాన్ తప్పించిన వ్యక్తికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బాధ్యతలు.. కీలక నిర్ణయం వెనుక కథ ఇదే..
Lt Gen Munir
Sanjay Kasula

|

Nov 24, 2022 | 9:27 PM

పాకిస్తాన్‌కు కొత్త ఆర్మీ చీఫ్ రాబోతున్నారు. లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ పాకిస్తాన్ 17వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా ఈనెల 29న రిటైర్ కాబోతున్నారు. ఆయన ప్లేస్‌లో అసిమ్ మునీర్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. లెప్ట్‌నెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాను జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి లెప్ట్‌నెంట్ జనరల్‌గా ఉన్న మునీర్ నాలుగేళ్ల పదవీకాలం నవంబర్ 27న ముగియనుంది. అయితే ఆయన రిటైర్మెంట్‌కు ముందే ఆర్మీ చీఫ్‌గా ప్రకటించడంతో.. మరో మూడేళ్ల పాటు పొడిగించనున్నట్లు తెలుస్తోంది.

లెప్ట్‌నెంట్ జనరల్ మునీర్.. ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో పనిచేశారు. 2017 ప్రారంభంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2018 అక్టోబర్‌లో ISI చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఎనిమిది నెలల్లోనే ఆయన్ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తప్పించారు. తనకు అత్యంత సన్నిహితుడైన లెఫ్టినెంట్-జనరల్ ఫైజ్ హమీద్‌ను కొత్త చీఫ్‌గా నియమించారు. ఐతే ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌.. మునీర్‌కు ఆర్మీ చీఫ్ బాధ్యతలను అప్పజెప్పారు.

ఇక రిటైర్ కాబోతున్న ప్రస్తుత ఆర్మీ చీఫ్ బజ్వా.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పదవీచ్యుతిడిని చేయడంలో సైన్యం పాత్ర ఏమీలేదన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అమెరికా జోక్యం వల్లే ప్రభుత్వం పడిపోయిందన్న ఆరోపణల్లోనూ వాస్తవం లేదన్నారు. తనకి భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలేదని తేల్చిచెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu