Osama Bin Laden- Nawaz Sharif: బిన్‌లాడెన్‌తో నవాజ్‌ షరీప్‌ సంబంధాలపై మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు

Osama Bin Laden- Nawaz Sharif:  ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ ఆశ్రయం ఇస్తోందని భారత్‌ దశాబ్దాలుగా చెబుతూ వస్తోంది. కానీ ఆ మాటలను అగ్రరాజ్యం అమెరికాతో సహా అనేక..

Osama Bin Laden- Nawaz Sharif: బిన్‌లాడెన్‌తో నవాజ్‌ షరీప్‌ సంబంధాలపై మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Feb 03, 2021 | 11:25 AM

Osama Bin Laden- Nawaz Sharif:  ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ ఆశ్రయం ఇస్తోందని భారత్‌ దశాబ్దాలుగా చెబుతూ వస్తోంది. కానీ ఆ మాటలను అగ్రరాజ్యం అమెరికాతో సహా అనేక దేశాలు పెడచెవిన పెట్టాయి. ఒసామా బిన్‌లాడెన్‌ను పాక్‌లో మట్టుబెట్టినప్పటి నుంచి అగ్రరాజ్యం కూడా పాక్‌పై ఎడముఖం ఎడముఖంగానే ఉంటోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ గ్రే లిస్టులోకి కూడా చేరింది. అయితే పాక్‌ మాత్రం తమకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని, తమను అనవసరంగా అనుమానిస్తున్నారని బుకాయిస్తూనే వస్తోంది. అయితే ఆ దేశానికి సంబంధించి షాకింగ్‌ నిజం బయటకు వచ్చింది. అమెరికా చేతిలో హతమైన అల్‌ఖైదా చీఫ్‌, ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను, అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు మధ్య సంబంధాలుండేవన్న విషయాలు బయటకు వచ్చాయి. అంతేకాదు షరీఫ్‌ కు లాడెన్‌ ఆర్థికంగా కూడా మద్దతిచ్చేవాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని పాక్‌ మాజీ ఉన్నతాధికారి ఒకరు స్వయంగా వెల్లడించడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. బిన్‌ లాడెన్‌ – నవాజ్‌షరీఫ్‌ల మధ్య ఓ విషయంలో ఒప్పందం ఉండేది. లాడెన్‌ తరచూ షరీఫ్‌ కు ఆర్థిక సాయం చేసేవారు అంటూ గతంలో అమెరికాలో పని చేసిన పాక్‌ రాయబారి అబిదా హుస్సేన్‌ కుండ బద్దలు కొట్టారు. ఓ ప్రముఖ ప్రైవేటు ఛానెల్‌కు ఇచ్చిన ఇంర్వ్యూలో ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. షరీఫ్‌ హయాంలో అబిదా హుస్సేన్‌ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించడంతో, ఆమెకు ఈ విషయాన్ని తెలిసి ఉంటుందనే చర్చ నడుస్తోంది.

ఇదిలా ఉంటే అవినీతి ఆరోపణల కేసులో 2017లో పదవీచ్యుతుడైన నవాజ్‌ షరీఫ్‌ ప్రస్తుతం లండన్‌లో దాలదాచుకుంటున్నాడు. అయితే అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అనారోగ్య కారణాలతో గత కొన్ని నెలలుగా అక్కడే జీవిస్తున్నారు. షరీఫ్‌పై ఇటీవల పాక్‌లోని అధికారి పార్టీ తెహ్రీక్‌-ఈఇన్సాఫ్‌కు చెందిన నేత ఫరూఖ్‌ అబీబ్‌ తీవ్రంగా ఆరోపించారు. ఈ క్రమంలోనే లాడెన్‌ సాయంతోనే షరీఫ్‌ అధికారంలో కొనసాగారని ఆరోపణలు చేశారు. దీనికి తోడు షరీఫ్ హయాంలో మంత్రి అయిన అబిదా హుస్సేన్‌ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: Kim Jong Un’s Wife Missing: ఏడాది కాలంగా కనిపించని కిమ్ భార్య సోల్ జు, ఎక్కడికి వెళ్లినట్టు ? ఎన్నో ఊహాగానాలు.