Omicron: గుడ్‌న్యూస్‌.. ఒమిక్రాన్‌ పుట్టినిల్లు సౌతాఫ్రికాలో తగ్గుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య..!

Omicron: కరోనా మహమ్మారి వ్యాప్తి చెంది దాదాపు రెండేళ్లు కావస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలోనే కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మరింత ఆందోళనకు..

Omicron: గుడ్‌న్యూస్‌.. ఒమిక్రాన్‌ పుట్టినిల్లు సౌతాఫ్రికాలో తగ్గుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య..!
Follow us

|

Updated on: Dec 22, 2021 | 10:37 AM

Omicron: కరోనా మహమ్మారి వ్యాప్తి చెంది దాదాపు రెండేళ్లు కావస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలోనే కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్‌ ఎన్నో దేశాలకు పాకింది. ఇక సౌతాఫ్రికాలో కోవిడ్‌ కేసులు భారీగా తగ్గుముఖం పట్టడమే కాకుండా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల కూడా తగ్గుముఖం పడుతున్నట్లు ఆ దేశ అధికారులు వెల్లడిస్తున్నారు. అక్కడ వరుసగా నాలుగో రోజు కోవిడ్‌ కేసులు మరింత తగ్గుతుండటంతో సంతోషకరమైన విషయమే. గత వారం ఇదే సమయంతో పోలిస్తే మరింత తక్కువగా కేసులు నమోదవుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడేవారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది.

ఈవారంలో కేవలం 5 శాతం మాత్రమే కేసులు పెరిగాయి. ఒమిక్రాన్‌ పుట్టినిల్లు సౌతాఫ్రికాలో కోవిడ్‌ కేసులతో పాటు కొత్త వేరియంట్‌ కేసులు కూడా తగ్గుతుండటం అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత బుధవారం 620 మంది కోవిడ్‌ బారిన పడగా, 35 మంది మరణించారు. దక్షిణాఫ్రికాలో కేవలం 25 శాతం మంది మాత్రమే బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిస్‌ తీసుకున్నారు. దీంతో కేసుల సంఖ్య తీవ్రంగా పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

వచ్చే ఏడాదిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెబుతుండగా, ఆయా దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతంగా జరుగుతోంది. ఇక యూకేలో ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. గత ఆరు రోజులు దాదాపు 90 వేల మంది ఇన్ఫెక్షన్లకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి బ్రిటన్‌లో మిలియన్లకొద్ది మంది వైరస్‌ బారిన పడే అవకాశం ఉందని శాస్త్రవేత్త చెబుతున్నారు.

గడిచిన 24 గంటల్లో దక్షిణాఫ్రికాలో 55,877 మందికి పరీక్షలు జరపగా, 15,424 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో పాజిటివిటీ 27.7 శాతానికి పడిపోయింది. ఇది పది రోజులలో నమోదైన కేసుల్లో అత్యల్పం. ఇందులో నిన్న ఒక్క రోజు కోవిడ్‌తో 35 మంది మృతి చెందారు. ఇక ఒమిక్రాన్‌ వేరియంట్‌ సౌతాఫ్రికాలోనే పుట్టినట్లు ధృవీకరించిన అధికారులు.. ఇప్పుడు వైరస్‌ మరింతగా క్షీణిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వైరస్‌ మరింతగా క్షీణించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బూస్టర్‌ డోస్‌ ఈ కొత్త వేరియంట్‌ కట్టడికి ఎంతగానో ఉపయోగపడనుందని వెల్లడిస్తున్నారు. గత నాలుగు రోజులుగా కోలుకుంటున్న వారి రేటు పెరుగుతోంది. కొత్త వేరియంట్‌ మొదలైనప్పటి నుంచి సౌతాఫ్రికాలో విధిస్తున్న ఆంక్షలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గేందుకు దోహదపడుతోందటున్నారు అధికారులు.

యూకేలో తొలి మరణం: యూకేలో ఇటీవల తొలి ఒమిక్రాన్‌ మరణం సంభవించింది. దీంతో అప్రమత్తమైన ఆ ఆదేశంలో ఆంక్షలు మరింత కఠినతరం చేస్తోంది. ఇక తర్వాత ఒమిక్రాన్‌ మరణం అమెరికాలో చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

India Covid-19: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. ఒమిక్రాన్ బాధితులు ఎంతమంది ఉన్నారంటే..?

Omicron విధ్వంసం.. క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ పార్టీలు రద్దు..! పెద్దల కంటే పిల్లలకు ప్రాణాంతకం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!