Norovirus: బ్రిటన్‌లో కొత్త వైరస్ కలవరం.. పెరుగుతున్న కేసులు.. నోరో వైరస్ వలక్షణాలు, పూర్తి వివరాలు ఇవే..

ఇంగ్లండ్‌లో కరోనా కేసులు తగ్గి ఆంక్షలు సడలించిన వేళ మరో వైరస్‌ కలకలం స‌ృష్టిస్తోంది. ఇంగ్లండ్‌లో ఐదు వారాల్లో 154 మంది నోరోవైరస్‌ బారిన పడ్డట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Norovirus: బ్రిటన్‌లో కొత్త వైరస్ కలవరం.. పెరుగుతున్న కేసులు.. నోరో వైరస్ వలక్షణాలు, పూర్తి వివరాలు ఇవే..
Norovirus
Follow us

|

Updated on: Jul 20, 2021 | 11:42 AM

Norovirus Outbreak in Britain: ఇంగ్లండ్‌లో కరోనా కేసులు తగ్గి ఆంక్షలు సడలించిన వేళ మరో వైరస్‌ కలకలం స‌ృష్టిస్తోంది. ఇంగ్లండ్‌లో ఐదు వారాల్లో 154 మంది నోరోవైరస్‌ బారిన పడ్డట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేగంగా వ్యాపించే గుణం ఉన్న ఈ వైరస్‌ సోకితే అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారు. ముఖ్యంగా కడుపుపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో దీన్ని వాంతిని కలిగించే సూక్ష్మజీవిగా నిపుణులు భావిస్తున్నారు. వైరస్‌ సోకిన వారి నుంచి కూడా వ్యాపిస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు రెండు, మూడు రోజులు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

అయితే, ఇది కూడా కరోనా వైరస్ లాంటిదే. చాలా తేలిగ్గా ఒకరి నుంచి ఇతరులకు సోకగలదు. గత 5 వారాల్లో 154 కేసులు నమోదైనట్లు బ్రిటన్ పబ్లిక్ హెల్త్ తెలిపింది. గత ఐదేళ్లలో చూస్తే… ఇదే 5 వారాల కాలంలో… ప్రతి సంవత్సరం సగటున 53 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అన్ని వయసుల వారికీ ఇది సోకుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.  ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కొత్త కేసుల సంఖ్య బాగా పెరిగినట్లు బ్రిటన్ ప్రభుత్వం జులై 16న ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా విద్యాసంస్థలు… ముఖ్యంగా నర్సరీలు, చైల్డ్ కేర్ సెంటర్లలో ఈ వ్యాధి సోకిన కేసులు బయటపడుతున్నాయి.

నోరో వైరస్ అంటే? నోరో వైరస్‌ని స్టమక్ ఫ్లు (Stomach flu) లేదా స్టమక్ బక్ (Stomach bug) అని కూడా అంటారు. ఇది ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ద్వారా వచ్చే జ్వరం లాంటిది కాదు అని అమెరికా వ్యాధుల నియంత్రణ సంస్థ (CDC) తెలిపింది.

నోరో వైరస్ లక్షణాలు: వాంతులు విరేచనాలు (diarrhoea) వికారం పొట్ట, పేగుల్లో తీవ్రమైన మంట (acute gastroenteritis)

ఇవి కొన్ని రోజులపాటూ ఉంటాయి. ఈ సమయంలో… వ్యాధి సోకిన వారు ముట్టుకునే వస్తువులు, ప్రదేశాల నుంచి ఈ వైరస్… ఇతరులకు వ్యాపించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొంతమందికి జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారికి 12 గంటల నుంచి 48 గంటల్లో లక్షణాలు బయటపడతాయి. చాలా మంది ఒకటి నుంచి 3 రోజుల్లో వ్యాధి నుంచి కోలుకుంటారు.

ఎలా వ్యాప్తి చెందుతుంది? తినే ఆహారం, తాగే నీరు ద్వారా నోరో వైరస్ మనుషులకు సోకగలదు. ఆల్రెడీ వైరస్ ఉన్నవారు ముట్టుకున్న వస్తువులు, ప్రదేశాలను టచ్ చేసిన వారు… తెలియకుండా ఆ చేతుల్ని నోట్లో పెట్టుకుంటే… వారికి ఈ వైరస్ సోకగలదు. అందుకే పిల్లలకు ఎక్కువగా సోకుతోంది.

వ్యాధి నివారణోపాయాలు.. ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. శుభ్రమైన నీరు వాడాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. టాయిలెట్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. పిల్లలకు డైపర్లు తరచుగా మార్చేస్తూ ఉండాలి. పరిశుభ్రతే ఈ వైరస్‌ నుంచి మనల్ని కాపాడుతుంది.

ఇది ప్రాణాంతకం కాకపోయినా… ఇది కలిగించే బాధ, నొప్పి, మంట చాలా తీవ్రంగా ఉంటాయనీ, ఇతరులకు వేగంగా సోకుతుందనీ… అందువల్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యులు సలహా మేరకు వెంటనే చికిత్స అందిస్తే త్వరగా కోలుకోవచ్చని చెబుతున్నారు.

Read Also… SBI Special FD Scheme: ఎస్‌బీఐలో ఈ స్కీమ్‌లో చేరేందుకు గడువు పెంపు.. వడ్డీ రేటు 6.2 శాతం