
ఇంగ్లాండ్‌లో శనివారం అర్ధరాత్రి రైలులో కత్తిపోట్లు తీవ్ర కలకలం సృష్టించింంది. కేంబ్రిడ్జ్‌షైర్‌లో లండన్ నుంచి హంటింగ్‌డన్‌కు వెళ్తున్న రైలులో దుండగులు కత్తులతో వీరంగం సృష్టించారు. రైలులో ప్రయాణిస్తున్న వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 9మంది పరిస్థితి విషమంగా ఉందని కేంబ్రిడ్జ్‌షైర్ పోలీసులు తెలిపారు.
శనివారం సాయంత్రం (నవంబర్ 1) ఇంగ్లాండ్‌లోని ఒక రైలులో లండన్ వెళ్తున్న రైలులో ఒక వ్యక్తి కత్తితో అనేక మంది ప్రయాణికులపై దాడికి పాల్పడ్డట్టు పోలీసుల తెలిపారు. చాలా మంది ప్రయాణికులు భయంతో వాష్‌రూమ్‌లలో దాక్కున్నారని వెల్లడించారు. డాన్‌కాస్టర్ నుండి లండన్ కింగ్స్ క్రాస్ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న రైలులో ఈ సంఘటన జరిగింది.
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంబ్రిడ్జ్‌షైర్‌లోని హంటింగ్‌డన్ స్టేషన్‌లో రైలును ఆపివేసి, ఇద్దరు అనుమానితులను సంఘటనా స్థలంలోనే అరెస్టు చేసినట్లు బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసులు తెలిపారు. పది మంది గాయపడ్డారని, వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ దాడిని ఒక పెద్ద సంఘటనగా ప్రకటించామని, ఉగ్రవాద నిరోధక విభాగం దర్యాప్తులో సహాయం చేస్తోందని పోలీసులు తెలిపారు. రైలు ఆగిన తర్వాత ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద కత్తితో ఒక వ్యక్తి కనిపించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తరువాత పోలీసులు టేజర్‌తో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ సంఘటనను భయంకరమైనదిగా అభివర్ణించారు. బాధితులందరికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని స్టార్మర్.. పోలీసులు, అత్యవసర సేవల అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా బ్రిటన్‌లో కత్తి దాడుల సంఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత సంవత్సరం ఇంగ్లాండ్, వేల్స్‌లో 50,000 కంటే ఎక్కువ కత్తులతో దాడికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇది 2013తో పోలిస్తే దాదాపు రెట్టింపు అని గణాంకాలు చెబుతున్నాయి. హోం శాఖ కార్యాలయం ప్రకారం, దాదాపు 60,000 కత్తులు జప్తు చేయడం జరిగింది. మరికొందరు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. రాబోయే పదేళ్లలో కత్తులతో నేరాలను సగానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బహిరంగంగా కత్తిని తీసుకెళ్లడం వల్ల నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. అయితే, గత సంవత్సరంలో కత్తులతో దాడికి సంబంధించిన హత్యలు 18 శాతం తగ్గాయి.
Ten people have been taken to hospital following a multiple stabbing on a train in Cambridgeshire.
Nine are believed to have suffered life-threatening injuries.
A major incident has been declared and @TerrorismPolice are supporting our investigation.https://t.co/kpyeKWR8cQ
— British Transport Police (@BTP) November 2, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..