దారుణం.. మెటర్నిటీ ఆసుపత్రిపై దాడి.. చిన్నారులు మృతి

దారుణం.. మెటర్నిటీ ఆసుపత్రిపై దాడి.. చిన్నారులు మృతి

ఆప్ఘనిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. రాజ‌ధాని కాబూల్‌లో మంగళవారం ఉదయం దుండగులు ఆయుధాలతో ఓ ఆసుపత్రిపై దాడి చేశారు. ఈ ఘటనలో 15 మంది చ‌నిపోయారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 12, 2020 | 7:58 PM

ఆప్ఘనిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. రాజ‌ధాని కాబూల్‌లో మంగళవారం ఉదయం దుండగులు ఆయుధాలతో ఓ ఆసుపత్రిపై దాడి చేశారు. ఈ ఘటనలో 15 మంది చ‌నిపోయారు. వారిలో ఇద్ద‌రు పసిపాప‌ల‌తో పాటు మ‌రో 11 మంది త‌ల్లులు, న‌ర్సులు ఉన్నారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. అందులో చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. మెడిసిన్స్ శాన్స్ ఫ్రాంటైర్స్ హాస్పిట‌ల్ లో ఈ దాడి జ‌రిగింది.

ఇదిలా ఉంటే ఆప్ఘన్‌లోనే మ‌రో చోట పోలీసు అంత్య‌క్రియ‌ల‌ను టార్గెట్ చేస్తూ దుండగులు బాంబు పేలుళ్లు జరిపారు. ఆ ఘ‌ట‌న‌లో 24 మంది చ‌నిపోగా.. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. రెండు ఘ‌ట‌న‌ల్లోనూ మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం. దాడికి పాల్ప‌డిన దుండ‌గులు పోలీసు దుస్తుల్లో వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. కాగా ఈ ఘటనలు జరిగిన తరువాత కొన్ని గంట‌ల పాటు సాగిన ఎదురుకాల్పుల్లో దుండ‌గులు హతమయ్యారు.

Read This Story Also: కరోనా లాక్‌డౌన్‌: పోలీసుల వీక్ ఆఫ్‌లపై హైదరాబాద్ సీపీ కీలక నిర్ణయం..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu