న్యూజిలాండ్ పీఎం ఇంట పెళ్లి బాజాలు

న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డ్నెర్న్ పెళ్లికి రెడీ అయ్యారు. చాలాకాలంగా తాను డేటింగ్ చేస్తూ వస్తోన్న ప్రియుడు, టీవీ వ్యాఖ్యాత క్లారకే గేఫోల్డ్‌తో ఆమె నిశ్చితార్థం చేసుకున్నారు. ఈస్టర్ సెలవుల్లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు ప్రధాని సిబ్బంది తెలిపారు. న్యూజిలాండ్ వెస్ట్‌కోస్ట్‌‌లో గత శుక్రవారం ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. దాదాపు ఏడేళ్ల క్రితం ఓ అవార్డు ఫంక్షన్‌లో గేఫోల్డ్, జెసిండాల మధ్య ఏర్పడిన పరిచయం.. ఆ తరువాత ప్రేమగా మారి, సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఈ […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:01 pm, Fri, 3 May 19
న్యూజిలాండ్ పీఎం ఇంట పెళ్లి బాజాలు

న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డ్నెర్న్ పెళ్లికి రెడీ అయ్యారు. చాలాకాలంగా తాను డేటింగ్ చేస్తూ వస్తోన్న ప్రియుడు, టీవీ వ్యాఖ్యాత క్లారకే గేఫోల్డ్‌తో ఆమె నిశ్చితార్థం చేసుకున్నారు. ఈస్టర్ సెలవుల్లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు ప్రధాని సిబ్బంది తెలిపారు. న్యూజిలాండ్ వెస్ట్‌కోస్ట్‌‌లో గత శుక్రవారం ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది.

దాదాపు ఏడేళ్ల క్రితం ఓ అవార్డు ఫంక్షన్‌లో గేఫోల్డ్, జెసిండాల మధ్య ఏర్పడిన పరిచయం.. ఆ తరువాత ప్రేమగా మారి, సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పది నెలల క్రితం ఈ జంటకు పాప పుట్టగా.. వివాహం చేసుకోవాలని వారు నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. పదిలో ఉండగా.. బిడ్డకు కాన్పునిచ్చిన ప్రధానుల్లో రెండో ప్రధానిగా ప్రపంచంలో జెసిండా పాపులర్ అయ్యారు. అలాగే న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయానికి తన బిడ్డను తీసుకువెళ్లిన ‘క్రెడిట్’ కూడా ఈమెకు ఉంది. కాగా ఇటీవల క్రైస్ట్‌చర్చ్ మసీదుల్లో జరిగిన నరమేధం సమయంలో బాధితులతో జెసిండా వ్యవహరించిన తీరుపై.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసిన విషయం తెలిసిందే.