New Zealand MP: ప్రసవ వేదనతో ఆసుపత్రికి సైకిల్ తొక్కుతూ వెళ్లి.. పండంటి పాపకు జన్మనిచ్చిన ఎంపీ.. వైరల్ స్టోరీ

New Zealand MP: పురిటి నొప్పులొస్తున్నా సైకిల్ మీద ఆస్పత్రికి వెళ్లి న్యూజిలాండ్ కు చెందిన ఎంపీ జూలీ అన్నె మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈ విషయాన్నీ జూలీ స్వయంగా తన సోషల్ మీడియా..

New Zealand MP: ప్రసవ వేదనతో ఆసుపత్రికి సైకిల్ తొక్కుతూ వెళ్లి.. పండంటి పాపకు జన్మనిచ్చిన ఎంపీ.. వైరల్ స్టోరీ
New Zealand Mp
Follow us

|

Updated on: Nov 28, 2021 | 6:41 PM

New Zealand MP: పురిటి నొప్పులొస్తున్నా సైకిల్ మీద ఆస్పత్రికి వెళ్లి న్యూజిలాండ్ కు చెందిన ఎంపీ జూలీ అన్నె మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈ విషయాన్నీ జూలీ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.  ఎంపీ జూలీ పురిటి నొప్పులొస్తున్నా బిడ్డ పుట్టడం కోసం సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడే కాదు ఈ ఎంపీ జూలీ అన్నే జెంటర్ గతంలో తన మొదటి బిడ్డ, కొడుకు పుట్టిన సమయంలో కూడా ఇలాగే చేశారు

తనకు రెండోసారి బిడ్డపుట్టిన విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆదివారం ఉదయం 3.04 గంటలకు మేము మా కుటుంబం సరికొత్త సభ్యురాలికి స్వాగతం పలికామని చెప్పారు. అంతేకాదు తాను లేబర్‌ పెయిన్స్ వస్తున్న సమయంలో  సైకిల్ తొక్కాలని నిజంగా అనుకోలేదు.. అయితే అలా అనుకోకుండా జరిగిందని చెప్పారు.

తాను హాస్పిటల్‌కి వెళ్లడానికి తెల్లవారుజామున 2 గంటలకు సైకిల్ మీద బయలు దేరినప్పుడు తనకు అంతగా నొప్పులు రాలేదని.. అయితే కొంత దూరం వెళ్లిన నొప్పుల తీవ్రత పెరిగిందని చెప్పారు. ఆసుప‌త్రికి వెళ్లిన గంట‌కే త‌న‌కు వైద్యులు డెలివ‌రీ చేశారని చెప్పారు. త‌న‌కు పాప పుట్ట‌గానే.. త‌ను సైకిల్ మీద ఆసుప‌త్రికి వెళ్లిన విష‌యాన్ని ఫోటోల‌తో స‌హా.. జూలీ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అంతేకాదు ఇప్పుడు తాను తన బిడ్డ ఇద్దరం ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నామని.. పాపా తన తండ్రి ఒడిలో హాయిగా నిద్రపోతుందని  ఫోటోలను షేర్ చేస్తూ.. క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. జెంటర్ పోస్ట్‌కి నెటిజన్ల నుండి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. కొంతమంది  పాపా పుట్టినందుకు సంతోషం వ్యక్తం చేయగా, మరికొందరు సైక్లింగ్ నుండి వ్యాయామం చేయడం వల్ల డెలివరీ సమయంలో చాలా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. అయితే జూలీ ప్రసవం కోసం సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. మూడు సంవత్సరాల క్రితం, జూలీ మొదటి డెలివరీ  సమయంలో కూడా ఆక్లాండ్ ఆసుపత్రికి సైకిల్ తొక్కుకునే వెళ్లారు.

అయితే న్యూజిలాండ్ లోని రాజకీయ నాయకులు ఇలా సాధారణ జీవితం గడపడం సర్వసాధారణం. న్యూజిలాండ్ ప్రధాని జాకిందా ఆర్డెన్ తన మూడు నెలల చిన్నారితో సహా ఐక్యరాజ్య సమితి మీటింగ్ కు వెళ్లారు. అప్పుడు తన బేబీకి పాలు ఇచ్చారు. అప్పట్లో ఆ విషయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Also Read:  హఠాత్తుగా గోర్లమీద తెల్ల మచ్చలు ఏర్పడ్డాయా.. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదంటున్న నిపుణులు

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య

గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.

మానవత్వం చాటుకున్న ఏఎస్‌ఐ... ఏం చేశారంటే ??