Earthquake: వణికిస్తున్న భూకంపాలు.. మరో ప్రాంతంలో కంపించిన భూమి.. పూర్తి వివరాలు

Earthquake: భూకంపాలు వణికిస్తున్నాయి. వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం వల్ల 1000 మందికి..

Earthquake: వణికిస్తున్న భూకంపాలు.. మరో ప్రాంతంలో కంపించిన భూమి.. పూర్తి వివరాలు
Nepal Earthquake
Follow us

|

Updated on: Jun 23, 2022 | 11:22 AM

Earthquake: భూకంపాలు వణికిస్తున్నాయి. వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం వల్ల 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మరో 1500మందికిపై తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అప్ఘన్‌ భూకంపం సంభవించిన 24 గంటల్లోనే నేపాల్‌లో కూడా భూకంపం సంభవించింది. ఈ భూకంపం నేపాల్‌లోని రాజధాని ఖాట్మండుకు 161 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. భూకంప తీవ్రత 4.3గా అంచనా వేయబడింది. నేపాల్‌లో భూకంపం వల్ల సంభవించిన నష్టంపై ఇంకా సమాచారం లేదు. అయితే, దీనికి ముందు, బుధవారం ఉదయం ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు పక్తికా ప్రావిన్స్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వివరాల ప్రకారం.. నేపాల్‌లో జరిగిన భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇదిలా ఉండగా, గురువారం తెల్లవారుజామున హాసన్ జిల్లాతో పాటు కర్ణాటకలోని పొరుగు ప్రాంతాలలో భూకంపం సంభవించింది. ఇక్కడ రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.

బుధవారం తెల్లవారుజామున దేశంలోని తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపంలో కనీసం 1,000 మందికిపైగా మరణించారు. 1,500 మందికి పైగా గాయపడినట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ వార్తా సంస్థ నివేదించింది. దశాబ్దాల కాలంలో దేశంలో సంభవించిన అత్యంత విధ్వంసకర భూకంపంగా ఇది భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం వల్ల సంభవించిన ప్రాణనష్టం, విధ్వంసంపై సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. వీలైనంత త్వరగా విపత్తు సహాయ సామగ్రిని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ దుఃఖ ఘడియలో ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని అన్నారు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన విధ్వంసకర భూకంప వార్త పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ప్రాణ నష్టంపై నా ప్రగాఢ సానుభూతి అని తెలిపారు.

పాకిస్థాన్ సరిహద్దుల్లో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల భారీ నష్టం వాటిల్లింది. ఈ శక్తివంతమైన భూకంపం సుదూర ప్రాంతాలలో పెద్ద నష్టాన్ని కలిగించింది. ఎందుకంటే ఇక్కడ ఇళ్ళు, ఇతర భవనాలు తగినంత బలంగా లేవు. కొండచరియలు విరిగిపడటం సాధారణం. భూకంప కేంద్రం లోతు కేవలం 10 కి.మీ మాత్రమేనని నిపుణులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లోని ఖోస్ట్ నగరానికి నైరుతి దిశలో 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు పొరుగున ఉన్న పాకిస్థాన్ వాతావరణ విభాగం తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!