Pakistan: పాక్ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కానున్న నవాజ్ షరీఫ్.. పాక్ మాజీ ప్రధాని స్వదేశానికి వచ్చేది అప్పుడే..

పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) చీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీప్ తిరిగి పాకిస్తాన్ కు వస్తారని.. మళ్లీ ఆయన రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తారని ఫెడరల్ మంత్రి, పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) నాయకుడు మియాన్ జావేద్ లతీఫ్

Pakistan: పాక్ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కానున్న నవాజ్ షరీఫ్.. పాక్ మాజీ ప్రధాని స్వదేశానికి వచ్చేది అప్పుడే..
Nawaz Sharif
Follow us

|

Updated on: Aug 16, 2022 | 11:08 AM

Pakistan: పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) చీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీప్ తిరిగి పాకిస్తాన్ కు వస్తారని.. మళ్లీ ఆయన రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తారని ఫెడరల్ మంత్రి, పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) నాయకుడు మియాన్ జావేద్ లతీఫ్ ప్రకటించారు. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ కు వచ్చేందుకు రంగం సిద్ధమవుతుందని, కుట్రలో భాగంగా తనను తొలగించారని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ చెప్పిన కొద్దిరోజులకే ఫెడరల్ మంత్రి మియాన్ జావేద్ ఈఅంశంపై స్పష్టత ఇచ్చారు. అల్-అజీజియా అవినీతి కేసులో నవాజ్ షరీఫ్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్షను అనుభవిస్తూ.. వైద్య చికిత్స కోసం 2019లో లండన్ వెళ్లారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సెప్టెంబర్‌లో లండన్ నుండి పాకిస్తాన్‌కు తిరిగి వస్తారని.. తిరిగి వచ్చిన తర్వాత నవాజ్ షరీఫ్ ను పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) జైలుకు వెళ్లనివ్వదని ప్రకటించారు.

స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత ఆయన క్రీయాశీల రాజకీయాల్లో ఉంటారని.. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారని మియాన్ జావేద్ లతీఫ్ పేర్కొన్నారు. నవాజ్ షరీప్ ఉనికి లేకుండా పాకిస్తాన్ రాజకీయాలు ఉండబోవన్నారు. ఆయన స్వదేశానికి తిరిగి రావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే ఆయన కొంత జైలు శిక్ష అనుభవించారని.. పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) అధినేత నవాజ్ షరీఫ్ విదేశాల నుంచి తిరిగి వచ్చాక జైలుకు వెళ్లడానికి తమ ప్రభుత్వం అనుమతించదన్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ పై మియాన్ జావేద్ మండిపడ్డారు. విదేశీ కంపెనీలు, వ్యక్తుల నుంచి ఇమ్రాన్ ఖాన్ నిధులు పొందినట్లు రుజువు అయిందని అన్నారు. ఆసుపత్రికి నిధులు ఇస్తే, వాటిని పార్టీ ఖాతాల్లో ఎందుకు జమ చేశారని ప్రశ్నించారు. ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్న సమయంలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారన్నారు. ఇమ్రాన్ ఖాన్ మళ్లీ అధికారంలోకి వస్తే అప్పులు పెరుగుతాయని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి