సరికొత్త వివాదంలో ట్రంప్.. ఈ సారి కష్టమే..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను గద్దె దించేందుకు డెమోక్రాట్లు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభలో వారు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రాట్​ అభ్యర్థి జో బైడెన్​కు నష్టం కలిగించేందుకు విదేశీ శక్తులను ట్రంప్​ ఆశ్రయించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపై అధికారికంగా విచారణ ప్రారంభించామని సభ స్పీకర్​ నాన్సీ పెలోసీ ప్రకటించారు. “ప్రతినిధుల సభలో అధికారికంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటిస్తున్నా. సభకు చెందిన ఆరుగురు సభ్యుల కమిటీ […]

సరికొత్త వివాదంలో ట్రంప్.. ఈ సారి కష్టమే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 25, 2019 | 2:48 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను గద్దె దించేందుకు డెమోక్రాట్లు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభలో వారు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రాట్​ అభ్యర్థి జో బైడెన్​కు నష్టం కలిగించేందుకు విదేశీ శక్తులను ట్రంప్​ ఆశ్రయించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపై అధికారికంగా విచారణ ప్రారంభించామని సభ స్పీకర్​ నాన్సీ పెలోసీ ప్రకటించారు.

“ప్రతినిధుల సభలో అధికారికంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటిస్తున్నా. సభకు చెందిన ఆరుగురు సభ్యుల కమిటీ అభిశంసన తీర్మానాన్ని విచారించాలని ఆదేశిస్తున్నా. అధ్యక్షుడు జవాబుదారీగా వ్యవహరించాలి. చట్టానికి ఎవరూ అతీతులు కారు” అంటూ నాన్సీ పెలోసీ పేర్కొన్నారు. అయితే జో బైడెన్​ను రాజకీయంగా ఎదుర్కోవడం కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెంస్కీతో ట్రంప్​ మాట్లాడారని గతంలో ఓ ఎన్జోవో సంస్థ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఆరోపణలను ట్రంప్​ ఖండించారు. జెలెంస్కీతో జో, హంటర్​ విషయమై మాట్లాడింది నిజమే అయినా వారిని ఒత్తిడి చేశానన్నది మాత్రం ఆరోపణలని ఆయన కొట్టిపడేశారు. డెమొక్రాట్ల మీడియా ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయటం సహజమేనని ఆయన విమర్శించారు.

కాగా ప్రతినిధుల సభలో సుమారు 235 మంది డెమొక్రాట్లు ఈ అభిశంసన తీర్మానాన్ని సమర్థిస్తున్నారు. ఫలితంగా దిగువ సభలో ఈ తీర్మానం నెగ్గే అవకాశం ఉంది. కానీ అమెరికా సెనేట్​లో రిపబ్లికన్లదే పైచేయి కావటం వల్ల.. అక్కడ ఈ తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువని పలువురు భావిస్తున్నారు.