బాగ్దాదీని వెంటాడి.. వేటాడి.. ‘ నేను సైతం ‘

ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నాయకుడు, కరడు గట్టిన ఉగ్రవాది అబూ బకర్ అల్-బాగ్దాదీ హతం కావడంలో తన పాత్ర కూడా ఉందని అంటోంది ఓ శునకం. ఓ వైపు అమెరికా దళాలు తమ గన్ లు ఎక్కుపెట్టి వెంటాడుతుండగా.. చేసేది లేక తన ముగ్గురు పిల్లలతో ఓ టన్నెల్ లోకి పారిపోయిన బాగ్దాదీ.. బిక్కచచ్చిపోయాడు. ,మరోవైపు ఆ దళాలతో బాటు అత్యంత సునిశిత శిక్షణ పొందిన ఓ శునకం కూడా అతడి వెంట పడింది. వెంటాడి.. వేటాడింది. […]

బాగ్దాదీని వెంటాడి.. వేటాడి.. ' నేను సైతం '
Follow us

|

Updated on: Oct 29, 2019 | 10:53 AM

ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నాయకుడు, కరడు గట్టిన ఉగ్రవాది అబూ బకర్ అల్-బాగ్దాదీ హతం కావడంలో తన పాత్ర కూడా ఉందని అంటోంది ఓ శునకం. ఓ వైపు అమెరికా దళాలు తమ గన్ లు ఎక్కుపెట్టి వెంటాడుతుండగా.. చేసేది లేక తన ముగ్గురు పిల్లలతో ఓ టన్నెల్ లోకి పారిపోయిన బాగ్దాదీ.. బిక్కచచ్చిపోయాడు. ,మరోవైపు ఆ దళాలతో బాటు అత్యంత సునిశిత శిక్షణ పొందిన ఓ శునకం కూడా అతడి వెంట పడింది. వెంటాడి.. వేటాడింది. అటు ఎలైట్ కమాండోలు, ఇటు సింహంలా దూసుకొస్తున్న ఈ జాగిలాన్ని చూసి పైప్రాణాలు పైనే పోయిన బాగ్దాదీ.. తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో తమ దేశ కమెండోలకు ఎంతగానో సాయపడిన ఈ శునకం తాలూకు చిత్రాన్ని అధ్యక్షుడు ట్రంప్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.’ ఐసిస్ అధినేత బాగ్దాదీని హతమార్చడంలో గొప్ప పాత్ర పోషించిన అద్భుతమైన ఈ జాగిలానికి సంబంధించిన చిత్రాన్ని బహిర్గతం చేస్తున్నాం.. అయితే దీని పేరు మాత్రం వెల్లడించలేం ‘ అని ఆయన పేర్కొన్నాడు. అయితే బాగ్దాదీ తనను తాను పేల్చేసుకుంటుండగా ఈ శునకం గాయపడింది. కానీ దాన్ని తిరిగి తెచ్చుకున్నామని, సురక్షితంగా ఉందని అయన తెలిపాడు. అమెరికా దళాలు విధుల్లో తమకు సాయంగా బెల్జియం మాలినోయిస్ జాతికి చెందిన శునకాలను వినియోగించుకుంటూ ఉంటాయి. 2011 లో ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చిన ఆపరేషన్ లో అమెరికా బలగాలు ‘ కైరో ‘ పేరుగల బెల్జియం మాలినోయిస్ జాతి కుక్కను ఉపయోగించుకున్నాయి. బాంబు పేలుడు వంటి ఘటనలు జరిగినప్పుడు అందుకు కారకులైనవారి పట్టివేతకుఇలాంటి మేలుజాతి శునకాలను వినియోగిస్తుంటారు.

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!