లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు.. హాలీవుడ్ స్టార్ల పరుగులు

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో రేగిన కార్చిచ్చు సామాన్య ప్రజలనే కాదు.. ప్రముఖులు, హాలీవుడ్ స్టార్స్ ని సైతం పరుగులు తీయిస్తోంది. చుట్టుముడుతున్న మంటల బారి నుంచి రక్షించుకునేందుకు వీరిలో అనేకమంది అర్దరాత్రి తప్పనిసరిగా తమ ఇళ్లను వదిలి కార్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వీరిలో నటులు, ప్రొడ్యూసర్లు, క్రీడాకారులు కూడా ఉన్నారు. హాలీవుడ్ స్టార్, ‘ కండల వీరుడు ‘ , కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ షెవార్జ్ నెగ్గర్ సైతం రాత్రికి రాత్రే తన […]

లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు.. హాలీవుడ్ స్టార్ల పరుగులు
Follow us

|

Updated on: Oct 29, 2019 | 12:56 PM

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో రేగిన కార్చిచ్చు సామాన్య ప్రజలనే కాదు.. ప్రముఖులు, హాలీవుడ్ స్టార్స్ ని సైతం పరుగులు తీయిస్తోంది. చుట్టుముడుతున్న మంటల బారి నుంచి రక్షించుకునేందుకు వీరిలో అనేకమంది అర్దరాత్రి తప్పనిసరిగా తమ ఇళ్లను వదిలి కార్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వీరిలో నటులు, ప్రొడ్యూసర్లు, క్రీడాకారులు కూడా ఉన్నారు. హాలీవుడ్ స్టార్, ‘ కండల వీరుడు ‘ , కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ షెవార్జ్ నెగ్గర్ సైతం రాత్రికి రాత్రే తన ఇంటిని ఖాళీ చేయక తప్పలేదు. ఇలా చేయకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది.. ప్లీజ్ గెటవుట్ అని ఆయన ట్వీట్ చేశాడు. ఈయన తాజాగా నటించిన ‘ టర్మినేటర్ డార్క్ ఫేట్ ‘ చిత్రం ప్రీమియర్ షో ని సోమవారం ప్రదర్శించాల్సి ఉండగా.. ఈ మంటల కారణంగా రద్దు చేశారు. ప్రీమియర్ పార్టీకి ఉద్దేశించిన ఆహారాన్ని స్థానిక అమెరికన్ రెడ్ క్రాస్ షెల్టర్లకు మళ్లించారు. కార్చిచ్చు కారణంగా ఇళ్ళు వదిలి వఛ్చిన నిర్వాసితులకు ఈ ఆహారాన్నిఈ షెల్టర్లలో ఇవ్వనున్నారు. ‘ ఏజెంట్స్ ఆఫ్ షీల్డ్ ‘ చిత్ర నటుడు క్లార్క్ గ్రెగ్, ‘ సన్స్ ఆఫ్ ఎనార్కీ ‘ క్రియేటర్ కుర్ట్ సటర్ కూడా తాము విధిలేక ఇళ్ళు వదలాల్సివచ్చిందని ట్వీట్ చేశారు. కార్చిచ్చు ప్రభావంతో బ్రెంట్ వుడ్ సిటీలో కోట్లాది డాలర్ల విలువ చేసే భవనాలు అగ్నికి ఆహుతవుతున్నాయి.ఒకప్పుడు వాల్డ్ ఫేమస్ అయిన ఈ ప్రాంతం పశ్చిమ భాగమంతా మంటలు వ్యాపించాయి. మాజీ ఫుట్ బాల్ స్టార్ . ఒ.జె.సింప్సన్, బాస్కెట్ బాల్ ‘ సూపర్ స్టార్ ‘ లెబ్రాన్ జేమ్స్, ఇతర మీడియా కంపెనీ ఎగ్జిక్యూటివ్ ల ఇళ్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ‘ లాస్ ఏంజిల్స్ లేకర్స్ ‘ సినిమా నటుడు జేమ్స్.. తాను తన కుటుంబంతో మంగళవారం తెల్లవారుజామున తరలిపోవాల్సి వచ్చిందన్నాడు. ఈయన రెండేళ్ల క్రితం 23 మిలియన్ డాలర్ల వ్యయంతో 8 బెడ్ రూములు గల అత్యంత సుందరమైన విల్లా కొన్నాడు. కాగా కార్చిచ్చు ఫలితంగా దట్టమైన పొగలు అలముకొంటుండగా.. బూడిద పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది. మంటలను ఆర్పడానికి ఆకాశం నుంచి హెలికాఫ్టర్లు శ్రమిస్తున్నాయి.