EVEREST : వేగంగా కరిగిపోతున్న ఎవరెస్ట్.. మేల్కోకపోతే పెను ముప్పు తప్పదా..?

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్(Mount Everest) శిఖరం అత్యంత వేగంగా కరిగిపోతోంది. ఎవరెస్ట్ పర్వత శ్రేణుల్లో గత 2వేల ఏళ్లలో ఏర్పడిన మంచు కేవలం 25 ఏళ్లలోనే కరిగిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

EVEREST : వేగంగా కరిగిపోతున్న ఎవరెస్ట్.. మేల్కోకపోతే పెను ముప్పు తప్పదా..?
Everest
Follow us

|

Updated on: Feb 06, 2022 | 12:31 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్(Mount Everest) శిఖరం అత్యంత వేగంగా కరిగిపోతోంది. ఎవరెస్ట్ పర్వత శ్రేణుల్లో గత 2వేల ఏళ్లలో ఏర్పడిన మంచు కేవలం 25 ఏళ్లలోనే కరిగిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతే కాకుండా శిఖరాగ్రానికి దగ్గరల్లో ఉన్న ఒక హిమానీ నదం కూడా వేగంగా కరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సౌత్‌ కోల్‌(South coal) అనే ఈ హిమానీ నదంపై ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు అమెరికాలో శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. గత 25 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో 55 మీటర్ల మేర ఐస్‌ తగ్గిపోయిందని అందులో వెల్లడైంది. మంచు వేగంగా కరిగిపోవడానికి మానవ తప్పిదాలే కారణమని సైంటిస్టులు అంటున్నారు. వాతావరణ మార్పులు, మానవ తాకిడి పెరగడం, పేరుకుపోతున్న వ్యర్థాలు మంచు వేగంగా కరిగేందుకు దోహదపడుతున్నాయని అంటున్నారు. టూరిస్ట్ స్పాట్గా మారిన ఎవరెస్ట్ పై భారీగా మానవ వ్యర్థాలు పోగై ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

సౌత్‌ కోల్‌ హిమానీనదం సముద్రమట్టానికి 7,900 మీటర్ల ఎత్తులో ఉంది. హిమాలయాల్లోని పలు హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. ఈ మంచు పైపొరను కార్బన్‌ డేటింగ్‌ విధానంతో విశ్లేషించినప్పుడు అది రెండు వేల సంవత్సరాల కిందట ఏర్పడినట్లు తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. పర్వతపాదాల వద్ద ఏర్పడ్డ సరస్సుల్లో నీటి మట్టం పెరిగి.. వరదలు(Floods) విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉంది. భారీ మంచుతో నిండి ఉండే ప్రాంతాల్లోనూ శిలలు కనిపిస్తున్నాయి. మౌంట్ ఎవరెస్ట్పై ఉన్న సౌత్ కల్నల్ గ్లేసియర్ అత్యంత వేగంగా కరిగిపోతున్నట్లు పరిశోధనలో తేలింది. సముద్రమట్టానికి 26,000 అడుగుల ఎత్తులో ఎవరెస్ట్ శిఖరాగ్రానికి కేవలం కిలోమీటర్ దిగువన ఈ సౌత్ కల్నల్ గ్లేసియర్ ఉంది.

ఎవరెస్ట్ శిఖరంపై మంచు ఇదే వేగంతో కరిగిపోతే పెను ప్రమాదం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని గ్లేసియర్లు రెండు బిలియన్ల మంది నీటి అవసరాలు తీరుస్తున్నాయి. ప్రపంచంలోని 10 అతి ముఖ్యమైన నదులకు హిమాలయాలే ఆధారం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరెస్ట్పై మంచు కరిగిపోతే తొలుత వరదలు అనంతరం కోట్ల మందికి నీటి కష్టాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Also Read

Hyderabad: భర్త షాపింగ్‌కు తీసుకెళ్లలేదని భార్య బలవన్మరణం.. తల్లి ప్రేమకు దూరమైన ఏడాదిన్నర చిన్నారి..

Pakishna: కశ్మీర్ విషయంలో పాత రాగాన్నే పాడిన పాక్ ప్రధాని.. కశ్మీర్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామని ట్వీట్..

Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ తెలుగులో పాడిన పాటలు కేవలం రెండు మాత్రమే.. అవేంటో తెలుసా.?