సిరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఈ సారి..

సిరియాలో మరోసారి బాంబుల మోత మోగింది. నిత్యం బాంబులతో దాడులకు పాల్పడే ఉగ్రవాదులు.. ఈ సారి మోర్టార్ షెల్స్‌తో విచక్షణారహితంగ దాడులకు దిగారు. దీంతో అలెప్పో నగరానికి సమీపంలోని అల్ వాధి గ్రామం రక్తసిక్తమయ్యింది. రషీద్ ప్రాంతంలోకి అడుగు పెట్టిన ఉగ్రవాదులు.. గ్రామంపై మోర్టార్ షెల్స్ ప్రయోగించారు. ఈ దాడిలో 12 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. కాగా, శనివారం ఇడ్లిబ్ ప్రాంతంలో వైమానిక దాడిలో ఏడుగురు మరణించిన ఘటన జరిగిన మరునాడే ఉగ్రవాదులు ఈ దాడికి […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:31 pm, Mon, 17 June 19
సిరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఈ సారి..

సిరియాలో మరోసారి బాంబుల మోత మోగింది. నిత్యం బాంబులతో దాడులకు పాల్పడే ఉగ్రవాదులు.. ఈ సారి మోర్టార్ షెల్స్‌తో విచక్షణారహితంగ దాడులకు దిగారు. దీంతో అలెప్పో నగరానికి సమీపంలోని అల్ వాధి గ్రామం రక్తసిక్తమయ్యింది. రషీద్ ప్రాంతంలోకి అడుగు పెట్టిన ఉగ్రవాదులు.. గ్రామంపై మోర్టార్ షెల్స్ ప్రయోగించారు. ఈ దాడిలో 12 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. కాగా, శనివారం ఇడ్లిబ్ ప్రాంతంలో వైమానిక దాడిలో ఏడుగురు మరణించిన ఘటన జరిగిన మరునాడే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. 2011 నుంచి సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే సిరియాలో లక్షల మంది మరణించగా.. వేలాది మంది జాడ లేకుండా పోయారు. ఉగ్రవాదులు తాజాగా జరిపిన దాడిలో 12 మంది మరణించడం సిరియాలో సంచలనం రేపింది.