అమెరికా అధ్యక్ష రేసులో బ్లూమ్‌బర్గ్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సై అంటూ అధికారికంగా ప్రకటించారు ప్రముఖ పారిశ్రామికవేత్త మైఖేల్ బ్లూమ్బర్గ్.. డెమెక్రాట్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పాడుతున్న బ్లూమ్‌బర్గ్‌..తనపోటీపై స్పష్టతనిచ్చేశారు.  ట్రంప్‌ను ఓడించేందుకే తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నానని, అమెరికా పునర్నిర్మాణమే తన లక్ష్యమని ప్రకటించారు. అమెరికాకు, మన విలువలకుట్రంప్ అత్యంత ప్రమాదకారిగా ఉన్నారు. ఆయన మరోసారి గెలిస్తే ఆ నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేం. ఈ ఎన్నికల్లో మనం తప్పకుండా గెలవాలన్నారు బ్లూమ్‌బర్గ్‌. మైఖేల్‌ బ్లూమ్‌బర్గ్‌ కూడా అమెరికాలో […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 6:44 pm, Mon, 25 November 19
అమెరికా అధ్యక్ష రేసులో బ్లూమ్‌బర్గ్‌
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సై అంటూ అధికారికంగా ప్రకటించారు ప్రముఖ పారిశ్రామికవేత్త మైఖేల్ బ్లూమ్బర్గ్.. డెమెక్రాట్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పాడుతున్న బ్లూమ్‌బర్గ్‌..తనపోటీపై స్పష్టతనిచ్చేశారు.  ట్రంప్‌ను ఓడించేందుకే తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నానని, అమెరికా పునర్నిర్మాణమే తన లక్ష్యమని ప్రకటించారు. అమెరికాకు, మన విలువలకుట్రంప్ అత్యంత ప్రమాదకారిగా ఉన్నారు. ఆయన మరోసారి గెలిస్తే ఆ నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేం. ఈ ఎన్నికల్లో మనం తప్పకుండా గెలవాలన్నారు బ్లూమ్‌బర్గ్‌.
మైఖేల్‌ బ్లూమ్‌బర్గ్‌ కూడా అమెరికాలో ప్రముఖ వ్యాపార దిగ్గజం. గతంలో ఆయన న్యూయార్క్‌ మేయర్‌గా సేవలందించారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం 10 బిలియన్ డాలర్ల వరకువిరాళాలు అందించారు. ఆయనకు చెందిన స్వచ్ఛంద సంస్థలు 129 దేశాల్లోని 510 నగరాల్లో సేవలందిస్తున్నాయి. వాతావరణ మార్పులపై పోరాటంలో కూడా క్రియాశీలకంగా
పనిచేశారు బ్లూమ్‌బర్గ్‌భారత ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడిగా మైఖేల్‌  బ్లూమ్‌బర్గ్‌కు పేరుంది. గత ఐదేళ్లలో అయన పలుమార్లు భారత్‌ వచ్చి వెళ్లారు. భారత్‌- అమెరికా సంబంధాలకు బ్లూమ్‌బర్గ్ గట్టిమద్దతుదారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బ్లూమ్‌బర్గ్‌ పోటీ సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.