చోక్సీకి అంటిగ్వా షాక్.. ఇక సంకెళ్లే..!

దేశంలో సంచలనం సృష్టించిన పీఎన్బీ స్కాం కేసులో నిందితుడైన మెహుల్ చోక్సీకి భారీ షాక్ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు దాదాపు రూ. 13 వేల కోట్ల రూపాయలను మోసం చేసిన నీరవ్ మోదీ బంధువైన చోక్సీ.. భారత్‌ను విడిచి ఆంటిగ్వా పారిపోయాడు. ప్రస్తుతం ఆయన అక్కడి పౌరసత్వం తీసుకుని ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. అయితే చోక్సీకి ఊహించని విధంగా అక్కడి ప్రభుత్వం షాకిచ్చింది. చోక్సీని భారత్‌కు అప్పగించేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. చోక్సీ నిజాయితీ […]

చోక్సీకి అంటిగ్వా షాక్.. ఇక సంకెళ్లే..!
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2019 | 1:20 PM

దేశంలో సంచలనం సృష్టించిన పీఎన్బీ స్కాం కేసులో నిందితుడైన మెహుల్ చోక్సీకి భారీ షాక్ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు దాదాపు రూ. 13 వేల కోట్ల రూపాయలను మోసం చేసిన నీరవ్ మోదీ బంధువైన చోక్సీ.. భారత్‌ను విడిచి ఆంటిగ్వా పారిపోయాడు. ప్రస్తుతం ఆయన అక్కడి పౌరసత్వం తీసుకుని ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. అయితే చోక్సీకి ఊహించని విధంగా అక్కడి ప్రభుత్వం షాకిచ్చింది. చోక్సీని భారత్‌కు అప్పగించేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. చోక్సీ నిజాయితీ లేని వ్యక్తంటూ తమకు పూర్తి సమాచారం ఉందని.. అలాంటి వ్యక్తితో తమ దేశానికి ఎటువంటి ప్రయోజనం లేదని ప్రధాని గాస్టన్ బ్రౌనే తెలిపారు. అతడి మీద విచారణ జరిపేందుకు భారత్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని.. అతడిని విచారించేందుకు భారత అధికారులు తమ దేశానికి రావచ్చొని అన్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పదని పేర్కొన్నారు. అయితే భారత్‌ నుంచి వచ్చిన సమాచారం ప్రకారమే అతడికి పౌరసత్వం ఇచ్చామంటూ చేసిన అంటింగ్వా ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఇప్పటికే ఈడీ అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.